ఆ డి డబ్ల్యు ఓ పై ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు పోస్టింగ్ మొదలుకొని అక్రమవసూళ్ల వరకు ఆ అధికారి మొత్తం అవినీతి బాటనే ఎంచుకుందని ఆరోపణలు వస్తున్నాయి …ములుగు జిల్లాలో తన తోటి ఉద్యోగులను టార్గెట్ గా చేసి నచ్చని వారిపై కావాలని ఫిర్యాదులు చేయించి తాను అధికారిననే పెత్తనంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…అంతేకాదు ఈ అధికారి ఎం చేసిన ,ఎన్ని ఆరోపణలు వచ్చిన ఉన్నతాధికారులు సైతం సదరు అధికారినికే సహకరిస్తూ వెనుకేసుకస్తున్నారని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది… ఓ మంత్రి ఆ మంత్రి పి ఏ,ఓ కలెక్టర్ అండ తనకు ఉందని తనను ఎవరూ ఎం చేయలేరని ఆ డి డబ్ల్యు ఓ బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్న అధికారులు, ఆ మంత్రి వేడుక చూస్తున్నారు తప్ప ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ములుగు జిల్లా ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది…. ములుగు జిల్లా డి డబ్ల్యు ఓ గా జూనియర్ ఐయిన అడ్డదారిన పోస్టింగ్ తెచ్చుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారిణి కి కుల అనే వివక్ష కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది… తన దగ్గర పని చేసే వారిని తోటి ఉద్యోగులను ఎవరిది ఏ కులమో అని ఆరాతీసి మరి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది…మరోవైపు జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు కొన్ని లేకున్నా ఉన్నట్లుగా రికార్డుల్లోకి ఎక్కించి ఆ సెంటర్లకు సంబంధించిన డబ్బులను అడ్డదారిని అప్పనంగా దిగమింగుతున్నట్లు తెలిసింది…ఈ అవినీతి వ్యవహారంలో నూగురు వెంకటాపూర్ ఇంచార్జ్ సి డి పి ఓ ధనలక్ష్మి ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా పిర్యాదు చేయడంతో కక్ష పెంచుకొని లేనిపోని ఆరోపణలతో తనకు సస్పెన్షన్ చేసే అధికారం లేకున్నా కలెక్టర్ కు పిర్యాదు చేసి సస్పెన్షన్ ఉత్తర్వులు అంటూ ఆ ఉత్తర్వులపై తాను అటెస్ట్ చేసి ఇంచార్జ్ సి డి పి ఓ ఆత్మహత్య కు పరోక్ష కారణం ఐయినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి….
అసలు ఆ అధికారిణి కి ఎందుకింత ధీమా…?
సహకరిస్తున్న ఆ మంత్రి పి ఏ ఎవరు…?
న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో….



