దశదిన ఖర్మకు ఉద్యోగులు..

హన్మకొండ జెడ్పీ కార్యాలయం ఖాళీ

విధులను మరిచి ఆ ఉద్యోగులు బాధ్యత రహితంగా వ్యవహరించారు..ఓ ఇంజనీరింగ్ అధికారి తల్లి దశదిన ఖర్మకు తరలి వెళ్లారు …తరలి వెళ్లడం అంటే ఒకరో ఇద్దరో కాదు… హన్మకొండ జిల్లా పరిషత్ కార్యాలయానికి చెందిన ఈ జి ఎస్,ఎస్ డి ఎఫ్ కు చెందిన ఉద్యోగులందరు తమ కార్యాలయ గదులకు తలుపులు వేసి మరి వెళ్లారు…వెళ్లడం అంటే వరంగల్ నగరంలో ఎదో ఓ చోటుకి కాదు హన్మకొండకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే పరకాల అవతలి ఓ గ్రామానికి తరలి వెళ్లారు…ఏ ఈ,డి ఈ లతో సహా ఉద్యోగులందరు విధులకు ఎగనామం పెట్టి పట్ట పగలు దశదిన ఖర్మ కార్యక్రమానికి తరలి వెళ్లారు…కార్యాలయంలో కేవలం ఓ అటెండర్ ను ఉంచి అందరు ఆ ఎస్ ఈ సారు ఇంటికి తరలి వెళ్లడం పట్ల విమర్శలు వస్తున్నాయి…ఉద్యోగులు ఎవరు లేక కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చిన వారు ఇదేందని…ప్రశ్నించడం కనిపించింది… అవును మరి మా సారు వాల్ల తల్లి దశదిన ఖర్మ కార్యక్రమం అందరూ అక్కడికే వెళ్లారు అని అక్కడ ఉన్న ఓ ఉద్యోగి సమాధానం చెప్పి వచ్చిన వాళ్లకు రెండు రోజుల తర్వాత రండి అంటూ సమాధానం ఇస్తున్నాడు…

పూర్తి వివరాలు న్యూస్10 సాయంత్రం సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here