వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయి…ప్రతి పనికి ఓ రేట్ ను పిక్స్ చేసి అడ్డగోలుగా రిజిస్ట్రేషనల్ లు చేస్తూ అవినీతి లో మేము ఏం తక్కువ కాదని రిజిస్ట్రేషన్ శాఖ లోని కొందరు అధికారులు నిరూపించుకుంటున్నారు…ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తూ వారికి కావాల్సింది అందితే చాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి ఒకే అనిపిస్తున్నారు…సరిగ్గా ఇలాగే త్రినగరి లోని ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతి తాండవం ఆడుతుంది…అక్రమ రిజిస్ట్రేషన్ లకు ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అడ్డాగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…
ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ చేతివాటం…
గత కొంత కాలంగా ఖిలా వరంగల్ ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ఆ అధికారి తన చేతివాటాన్ని బాగానే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది…ఇక్కడ పనిచేసే సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండగా ఇంచార్జ్ గా ఈ అధికారి బాధ్యతల్లో కొనసాగుతు అక్రమ రిజిస్ట్రేషన్ లను చాలా ఈజీగా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి….సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఇష్టారాజ్యం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది…నాన్ లే ఔట్ వెంచర్లకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఇందుకు ప్రతిఫలంగా రియల్టర్ల వద్దనుంచి బాగానే దండుకున్నట్లు సమాచారం..ప్లాట్ల వారిగా నాల కన్వర్షన్ లు చేయించి గుంటల కొద్ది భూమిని గజాల్లో మార్చి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తెలియవచ్చింది….గుంటల్లో భూమిని గజాల్లో ప్లాట్లల్లోకి మార్చుతూ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది… ఈ సబ్ రిజిస్ట్రార్ రియల్టర్లకు పూర్తిగా సహకరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి…తీగ లాగితే డొంక కదిలే చందగా ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అక్రమాలు బాగానే బయట పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు….
ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రారా…?మజాకా..?
నిబంధనలకు నీళ్ళు..దండిగా రూపాయలు…
మరో సంచికలో



