తనపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం హన్మకొండ అదనపు కలెక్టర్ నానా తిప్పలు పడుతున్నారు…పౌర సరఫరాల శాఖలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారి…తనపై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పకుండా తన విధానాన్ని మార్చుకోకుండా “ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు”ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది…తన నోటికి ఏది వస్తె అది మాట్లాడుతూ దుర్భాష లాడుతున్నట్లు తెలియ వచ్చింది…న్యూస్10 కు సమాచారం ఎవరు ఇచ్చిన తోలు తీస్తా… అంటూ హెచ్చరించినట్లు సమాచారం…. న్యూస్ 10 లో వస్తున్న కథనాల విషయంలో ఏమాత్రం సంబంధం లేని కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేస్తూ తిట్ల దండకం అందుకుంటున్నట్లు సమాచారం…అంతేకాదు తనకున్న అధికారాలను ఉపయోగించి తనకు నచ్చని అధికారులను తప్పించేందుకు బదిలీ అస్త్రం ఉపయోగిస్తున్నట్లు తెలియవచ్చింది..అదనపు కలెక్టర్ తనకు నచ్చని అధికారులపై బదిలీ అస్త్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాడని న్యూస్10 ఇటీవలే చెప్పింది…సరిగ్గా అలాగే అదనపు కలెక్టర్ నేను తగ్గను నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అన్నట్లు ఓ డి టి సి బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం…ఇందుకోసం ఇప్పటికే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసినట్లు… అవి రేపో మాపో అమలు కానున్నట్లు తెలిసింది…అయితే హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఒంటెద్దు పోకడలు పోతున్న అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తనకు నచ్చని అధికారులను బదిలీ చేసేందుకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…కేవలం ఓ మిల్లర్ ఇస్తున్న తప్పుడు సమాచారం తో తనవద్ద పనిచేస్తున్న అధికారులపై అనవసరంగా బదిలీ వేటు వేస్తూ అదనపు కలెక్టర్ పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రస్తుతం కలెక్టరేట్ లో చర్చ జరుగుతోంది….తనకు నచ్చిన అన్ని రకాలుగా సహకరిస్తున్న మిల్లర్లకు తాను సహకరిస్తూ…తనతో విభేదించిన మిల్లర్స్ పై అదనపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది…ఒక్కో సారి తనకు అనుకూలమైన మిల్లర్ కోసం కార్యాలయ సమాచారాన్ని సైతం లీక్ చేస్తున్నట్లు కలెక్టరేట్ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది…
రాత్రిపూట మంతనాలు…
హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఈమధ్య కాలంలో తాను నిర్వహించే విధుల కంటే ఓ మిల్లర్ తో తన ఛాంబర్ లో కూర్చొని చిట్ చాట్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనపడుతుంది…తనకు అవసరం లేకున్న తరచుగా అదనపు కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు ఏవో మంతనాలు జరుపుతు ఉన్నట్లు తెలిసింది…సరిగ్గా సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ కు ఓ ఇద్దరు మిల్లర్స్ కలిసి వచ్చిన అసోసియేషన్ నాయకుడు రాత్రి ఏడు గంటలవరకు అదనపు కలెక్టర్ తో ఏవో మంతనాలు జరిపినట్లు తెలియవచ్చింది…తాను జిల్లా ఉన్నతాధికారిని అనే విషయం మరిచి కేవలం ఓ అసోసియేషన్ నాయకుడితో గంటల కొద్ది తన ఛాంబర్ లో ఏవో మంతనాలు చేయడం ఎందుకో…? అదనపు కలెక్టర్ కే తెలియాలి…తనకు అధికారం ఉంది కదా అని నోటికి ఏది వస్తె అది మాట్లాడి ఉద్యోగులను ఎందుకు తిట్టాల్సి వస్తుందో… ఏ కారణం లేకుండా కనీసం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోకుండా అదనపు కలెక్టర్ ఉద్యోగులను బదిలీ చేస్తూ…బదిలీ చేస్త అంటూ ఎందుకు బెదిరింపు సంకేతాలు ఎందుకు ఇస్తున్నాడో దీని వెనకాల ఏం ఆంతర్యం దాగి ఉందో ఆయనకే తెలియాలి…



