తిరగబడ్డ మిల్లర్లు

అధికారుల పేరుతో మిల్లర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాడని,ఓ ఉన్నతాధికారి కి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ధాన్యం ట్యాగింగ్ కోసం రెండు లక్షలు వసూల్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడిపై మిల్లర్లు తిరగబడ్డారు…. ట్యాగింగ్ కోసం అందరి దగ్గరనుంచి డబ్బులు వసూలు చేయడానికి అసోసియేషన్ నాయకుడు సోమవారం సాయంత్రం వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడట…ఈ సమావేశానికి రా,బాయిల్డ్ రైస్ మిల్లర్లు అందరూ హాజరు కావాలని చెప్పాడట..దింతో హుటాహుటిన నలభై మందికి పైగా మిల్లర్లు సమావేశానికి హాజరు అయినట్లు తెలిసింది…సమావేశం ప్రారంభం కాగానే ట్యాగింగ్ కోసం డబ్బులు చెల్లించాలని అసోసియేషన్ నాయకుడు ప్రస్తావించగానే మిల్లర్లు మూకుమ్మడిగా డబ్బులు ఇచ్చేది లేదని అసోసియేషన్ నాయకుడిపై తిరగబడ్డారట…అధికారుల కోసం మీరు డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారట…అసోసియేషన్ నాయకుడిగా ఉంటూ వసూళ్ల దందాను ఎలా ప్రోత్సహిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారట…ఇంకా ఎన్ని రోజులు అసోసియేషన్ పేరుతో,అధికారుల పేరుతో తమను పీడిస్తారని మిల్లర్లు అసోసియేషన్ నాయకుడిని కాస్త గట్టిగానే అర్సుకున్నారట…దింతో ఎం మాట్లాడాలో తెలియక ,సమాధానం చెప్పలేక అసోసియేషన్ నాయకుడు సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది…

విజిలెన్స్ పేరుతో బెదిరింపులు…?

ఇదిలాఉంటే మిల్లర్లు తిరగబడి ప్రశ్నించడంతో ఎటు పాలుపోని అసోసియేషన్ నాయకుడు విజిలెన్స్ పేరుతో బెదిరింపులకు దిగినట్లు తెలిసింది…మంత్రి తన బందువని,విజిలెన్స్ లో పెద్ద అధికారి తనకు బాగా దగ్గర అని ఇక నుంచి అన్ని మిల్లుల్లో తాను విజిలెన్స్ దాడులు చేయిస్తానని శపథం చేసినట్లు సమాచారం…కమలాపూర్ మండలం లో అసోసియేషన్ నాయకుడి మిల్లుల్లో ఐయినట్లే అందరి మిల్లుల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని మిల్లర్లను ఆ అసోసియేషన్ నాయకుడు బెదిరింపులకు గురి చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది…ఇంత కచ్చితంగా చెబుతున్నాడు అంటే అసోసియేషన్ నాయకుడిగా ఉంటూ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి విజిలెన్స్ తో తానే దాడులు చేయిస్తూ వసూళ్లకు దిగుతున్నాడా..?అని మిల్లర్ల లో అనుమానం కలుగుతున్నట్లు తెలుస్తుంది…తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే మిల్లర్లను అసోసియేషన్ నాయకుడు విజిలెన్స్ పేరుతో బెదిరించడం ప్రస్తుతం మిల్లర్ల లో చర్చానీయాంశంగా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here