శాయంపేట పోలీసుల వినూత్న ఆలోచన

రోడ్డు ప్రమాదాల నివారణకు పరకాల ఏసిపి సతీష్ బాబు ఆధ్వర్యంలో శాయంపేట పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు…శాయంపేట మండలం లోని కొత్తగట్టు సింగారం గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దీంతో పరకాల ఏసిపి సతీష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రాత్రి సమయంలో చీకటి లో కూడా కన్పించే విదంగా 3D రేడియంతో చేయించిన స్టిక్కర్లు (బోర్డింగ్స్, కటౌట్స్) కొత్తగట్టు సింగారం గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేశారు…దింతో చీకట్లో కూడా త్రీడి స్టిక్కర్స్,బోర్డింగ్స్ వాహనదారులకు స్పష్టంగా కనపడి ప్రమాదాలు జరగకుండా ఉండేలా దోహదపడుతుంది… శాయంపేట పోలీసుల వినూత్న ఆలోచన ,త్రీడి స్టిక్కర్స్ ,బోర్డింగ్స్ ఏర్పాటు పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు… కొట్టగట్టు సింగారం సమీపంలో మూల మలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతుండేవని వీటిని దృష్టిలో పెట్టుకొని పరకాల ఏసీపీ ఇలాంటి ఏర్పాట్లు చేయించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు…ఈ కార్యక్రమంలో శాయంపేట సీఐ పి రంజిత్ రావు, శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.

శాయంపేట పోలీసుల వినూత్న ఆలోచన- news10.app
త్రీడి స్టిక్కర్స్, బోర్డింగ్స్ ఏర్పాటు చేయిస్తున్న పరకాల ఏసీపీ సతీష్ బాబు,సిఐ రంజిత్ రావు,ఎస్సై పరమేశ్వర్
శాయంపేట పోలీసుల వినూత్న ఆలోచన- news10.app
చికట్లో స్పష్టంగా కనిపిస్తున్న త్రీడి స్టిక్కర్స్,బోర్డింగ్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here