పైసలిస్తేనే ట్యాగింగ్

హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో ఆ ఉన్నతాధికారిని కట్టడి చేసేవారు ఎవరు లేనట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి…కమిషనర్ స్థాయిలో పిర్యాదులు వెళ్లిన ఆయనపై ఎవరు చర్యలు తీసుకోవడం లేదట…దింతో ఆ శాఖలో ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుందని తెలుస్తుంది…ఆ ఉన్నతాధికారి కి చెక్ పెట్టేవారు ఎవరు లేరు కనుక ఆయన వ్యవహరిస్తున్న తీరుతో కొందరు మిల్లర్లు పరేషాన్ అవుతున్నట్లు తెలుస్తోంది…ధాన్యం కేటాయింపు జరుగుతున్న తరుణంలో సర్కార్ నిబంధనలకు అనుగుణంగా మిల్లర్లు బి జి(బ్యాంక్ గ్యారంటీ) సమర్పించిన కేటాయించిన ధాన్యం ట్యాగింగ్ చేయడానికి మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడి మధ్యవర్తిత్వం తో అక్షరాల రెండు లక్షలు ఇస్తే తప్ప ధాన్యం కేటాయించేది లేదని ఆ ఉన్నతాధికారి తేల్చిచెప్పినట్లు తెలిసింది…అసలే ఉన్నతాధికారి ఆర్డర్ ఆపై అసోసియేషన్ నాయకుడి మధ్యవర్తిత్వం దింతో మిల్లర్లు చేసేదేమిలేక ట్యాగింగ్ కోసం ఆ ఉన్నతాధికారి రెండు లక్షల రూపాయలు సమర్పించుకునేందుకు సిద్ధపడగా ఇప్పటికే కొందరు మిల్లర్లు ఆ ఉన్నతాధికారిని ఆయన ఇంట్లోనే కలిసి అడిగిన చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది… ఇక మిగతా వారు కూడా ఖచ్చితంగా చెల్లించాలని అసోసియేషన్ నాయకుడు చెప్పడంతో మిగతా మిల్లర్లు సైతం ఈ చెల్లింపులకు సిద్ధపడ్డారని తెలియవచ్చింది….ఉన్నతాధికారి కి దగ్గరై అడిగింది సమర్పిస్తే తాము ఎం చేసిన చెల్లుబాటు అవుతుందని భావించిన కొందరు మిల్లర్లు హన్మకొండ లోని ఆ ఉన్నతాధికారి నివాసానికి వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం…

బి జి లేకున్నా…అవినీతి ఆరోపణలు ఉన్నా…?

హన్మకొండ జిల్లా లోని కొందరు మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకున్న అధికారులు ధాన్యం కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఇక్కడ విచిత్రం ఏంటంటే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లను కొందరి ని పక్కన పెట్టి బి జి ఇవ్వని మిల్లర్లు కొందరికి ధాన్యం కేటాయించేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…ఇది తప్పు అని తెలిసినా తాము ప్రశ్నిస్తే తమను ఎక్కడ టార్గెట్ చేస్తారేమోనని కొందరు మిల్లర్లు ఈ విషయంపై పెదవి విప్పకుండ ఉంటున్నారని తెలుస్తుంది…అంతే కాదు కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టిందని,ఇటీవల విజిలెన్స్ తనిఖీల్లో బహిర్గతం ఐయిన ముచ్చర్ల మిల్లర్ కు సైతం ధాన్యం భారీగానే కేటాయించాలని ఉన్నతాధికారి అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది…

నేనేం చేసినా…?

ధాన్యం ట్యాగింగ్ కోసం మిల్లర్ల వద్ద నుంచి ఆ ఉన్నతాధికారి అసోసియేషన్ నాయకుడి మధ్యవర్తిత్వం తో వసూళ్లు చేస్తున్నట్లు న్యూస్10 లో కథనం వెలువడగానే నేనేం చేసినా…?అంటూ ఏమి తెలియనట్లు కొందరు మిల్లర్లను ఆ ఉన్నతాధికారి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది…ఈ వార్త కథనాలు రాకుండా మీరే చూసుకోవాలని అంటూ ఆ ఉన్నతాధికారి మిల్లర్లను ఆదేశించినట్లు సమాచారం… కాగా తమ పేరు బయటకు రావడానికి ఇష్టపడని మిల్లర్లు కొందరు ఇప్పటికే ధాన్యం ట్యాగింగ్ కోసం ఆ ఉన్నతాధికారి వసూళ్లు చేస్తుంది నిజమని న్యూస్10 దృష్టికి తీసుకువచ్చారు…తమ వ్యాపారానికి ఎక్కడ ఆ ఉన్నతాధికారి ఎక్కడ కొర్రీలు పెడతాడేమోనని భయంతో అడిగింది సమర్పిస్తున్నాం అని స్పష్టం చేశారు…ఉన్నతాధికారి ఇంటికి కొందరు మిల్లర్లు రాత్రి పూట వెళ్లి ప్రసన్నం చేసుకుంది నిజమేనని చెప్పారు…ఈ వసూళ్ల పర్వానికి అసోసియేషన్ నాయకుడే మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిపారు…ఇదిలాఉంటే ఉన్నతాధికారి తనకేం తెలియనట్లు మిల్లర్లను ప్రశ్నించడం… ఆఘమేఘాల మీద మిల్లర్స్ అసోసియేషన్ కు చెప్పి బాయిల్డ్,రా మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయించి అంతా బాగానే ఉంది…ఆ సారు సత్య హరిచంద్రుడు అనిపించుకోవడం ఎందుకో ఆ సారుకే తెలియాలి…చేతివాటం తగ్గించుకొని పొరపాట్లు జరగకుండా చూసుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్లో ఆ ఉన్నతాధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో పదే పదే అవినీతి ఆరోపణలు,భారీ స్కామ్ లు ఎందుకు జరుగుతున్నాయో సివిల్ సప్లయీస్ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here