తీగ లాగి ఎం చేశారు…?

హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో జరిగిన భారీ స్కామ్ లో తీగలాగారు…డొంక కదిలించే ప్రయత్నం చేశారు కానీ సర్కార్ సొమ్ము మెక్కిన వారిపై ఎందుకో నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు… ప్రజా ధనం దిగమింగిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టకుండా తమకు తోచిన కేసులు పెట్టి అధికారులు మమ అనిపించినట్లు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… పాత్రధారులను గుర్తించి సూత్రధారులను గుర్తించలేదని ఆరోపణలు సైతం ఉన్నాయి…రాష్ట్రంలో రెండో అతిపెద్ద స్కామ్ అని విజిలెన్స్ అధికారులు భావించిన కేసులో కొద్దోరోజుల్లోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు స్వేచ్ఛ విహాంగాలు అయిపోయారు….తమకు సర్కార్ కేటాయించిన లాగిన్ వివరాలను ప్రైవేట్ వ్యక్తికి అప్పగించిన శాయంపేట ఏ ఓ,ప్రగతి సింగారం ఏ ఈ ఓ స్టేషన్ బెయిల్ తో విధులకు హాజరు అవుతున్నారు…తమ శాఖ లో ఇంత జరిగినా మాకేం సంబంధం అన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆ ఇద్దరు ఉద్యోగులపై ఎలాంటి శాఖ పరమైన చర్యలు తీసుకోకుండా వదిలేశారు…ఈ భారీ స్కామ్ లో అసలు జరిగిందేమిటి…..పోలీస్ విచారణలో తేలింది ఏంటో అంతా గప్ చుప్…ఈ స్కామ్ లో పెద్దమొత్తంలో డబ్బులు నొక్కేసారని విజిలెన్స్ అధికారులే చెప్పిన నేపథ్యంలో అసలు ఎవరికి ఎంత ముట్టింది…ఎవరు ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు…?అనేది ఇంకా ఎం తెలనట్లే ఉంది…

ఇంతకీ ధాన్యం భారీ స్కామ్ తెరవెనుక ఎం జరిగింది…?

ఆర్ ఆర్ యాక్ట్ ఎందుకు పెట్టలేదు…?

సర్కార్ ఖజానాకు గండి పడ్డ ఫర్వాలేడా…?

వ్యవసాయ శాఖ ఎందుకు చేతులు ముడుచుకుంది…?

న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here