
జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టిఏ కార్యాలయం లో ఆ నలుగురు అధికారులు, ఆ నలుగురు ఏజెంట్ల హవా ఏమాత్రం తగ్గకుండా అక్రమ వసూళ్ల బాటలో కొనసాగుతూనే ఉంది…అక్రమ వసూళ్లు మా జన్మ హక్కు అన్నట్లు ఇక్కడి అధికారులు నియమించుకున్న ఏజెంట్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇష్టారీతిన వసూళ్లు చేసి తమను నియమించుకున్న అధికారులకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…సార్లు చెప్పారు,, జిల్లా రవాణా శాఖ అధికారి చెప్పాడు అందుకే వసూళ్లు చేస్తున్నాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఇక్కడి ఏజెంట్లు అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది…
టాక్సీ డ్రైవర్ వసూల్ రాజా…?
జోగులాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఓ సాధారణ టాక్సీ డ్రైవర్ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది…ఇతగాడు అక్కడి అధికారికి ఏజెంట్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వసూళ్ల దందా ను చక్కబెడుతూ బాగానే వసూళ్లు చేస్తూ ఆ అధికారికి క్రమం తప్పకుండా అప్పగిస్తున్నట్లు తెలిసింది…రోజువారి వసూళ్లు కార్యాలయం వద్ద సార్లు నియమించుకున్న వారు వసూలు చేస్తే కేవలం నెల వారి వసూళ్ల కోసం ఈ టాక్సీ డ్రైవరే ను ఆర్టిఏ అధికారి నియమించుకున్నట్లు తెలుస్తోంది… వానదారుల అసోసియేషన్ ఇతర అసోసియేషన్ ల నుంచి ఈ టాక్సీ డ్రైవర్ వసూళ్ల చేసి సారుకు అప్పగిస్తాడని జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టిఏ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి…వసూలు చేసిన మొత్తంలో సారుకు సింహ భాగం అప్పగించి కొసరు మాత్రమే తీసుకునే ఈ టాక్సీ డ్రైవర్ సారు చలువతో బాగానే వెనకేసినట్లు తెలియవచ్చింది…గద్వాల పట్టణం లోని ఓ ప్రధాన ప్రాంతంలో జి ప్లస్ ఫైవ్ భవంతి నిర్మించి టాక్సీ డ్రైవర్ బాగానే సెటిల్ ఐయినట్లు సమాచారం…కేవలం కొసరు తీసుకునే టాక్సీ డ్రైవరే ఇలా కోట్లు కూడబెడితే అసలు తీసుకునే అధికారి సంగతి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రచారం సాగుతోంది….
“రా”మ “రా”మ ఇదేం దందా…?
ఆ ఎంవీఐ,అధికారి తీరు మారదా…?




