ధాన్యం ఎలా కేటాయిస్తారు…?

హన్మకొండ జిల్లాలో మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు…నిర్దేశించిన సమయానికంటే ముందుగానే మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసి ఈ రోజు సాయంత్రమే ధాన్యం కేటాయించేందుకు సిద్ధమయ్యారు…ఇదంతా బాగానే ఉన్నా ధాన్యం కేటాయింపులో అధికారులు ఎలాంటి మార్గదర్శకాలను అవలంబిస్తున్నారనేది చర్చానీయాంశంగా మారింది… బకాయి మిల్లర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…?కోట్ల రూపాయల బకాయి ఉన్న ధాన్యం కేటాయిస్తార…?లేక ఆ మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతారా…? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి… గతంలో లాగా ఇష్టారీతిన ధాన్యం కేటాయిస్తార…?మిల్లు కెపాసిటీ తో సంబందం లేకుండా కేటాయింపులు జరిగాయి అనిపిస్తారా…?జిల్లా కలెక్టర్ ఇటీవల ధాన్యం కేటాయింపు విషయంలో నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు పాటిస్తారా…?చూడాలి..అంతేకాదు బకాయి లో టాప్ టెన్ లో ఉన్న మిల్లర్లు సైతం తమకు ధాన్యం కేటాయిస్తారనే ఆశతో ఉండగా ఈ టాప్ టెన్ లో ఉన్న ఓ మిల్లర్ 18 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు తెలుస్తుంది…ఇవి కాకి లెక్కలు కాదు అధికారిక లెక్కలే మరి ఇలాంటి మిల్లర్లకు ధాన్యం కేటాయించి అధికారులు స్నేహ హస్తాన్ని అందిస్తార..? బకాయి మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశాలను పాటిస్తారా…?అప్పటికే హన్మకొండ జిల్లాలో జరిగిన ధాన్యం భారీ స్కామ్ రాష్ట్రం లోనే సంచలనం కలిగించింది… దీని నుంచైనా పాఠం నేర్చుకొని అధికారులు కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించి జాగ్రత్తలు పాటిస్తారా…?

కోట్ల రూపాయల బకాయి మిల్లులు…?

ధాన్యం కేటాయింపు కు లైన్ లోనే…?

అధికారులు వారికి సహకరిస్తున్నార…?

బకాయి మిల్లుల జాబితా ఇదిగో…

న్యూస్10 విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here