హన్మకొండ జిల్లాలో మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేశారు…నిర్దేశించిన సమయానికంటే ముందుగానే మిల్లర్లకు ధాన్యం జిల్లా పౌర సరఫరాల అధికారులు ధాన్యం కేటాయించారు.. ఏర్పాట్లన్ని పూర్తి చేసిన అధికారులు శనివారం సాయంత్రమే ధాన్యం కేటాయించారు…ఇదంతా బాగానే ఉన్నా ధాన్యం కేటాయింపులో అధికారులు ఎలాంటి మార్గదర్శకాలను అవలంబించారనేది చర్చానీయాంశంగా మారింది… బకాయి మిల్లర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు…?కోట్ల రూపాయల బకాయి ఉన్న ధాన్యం కేటాయించారా..?లేక ఆ మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు…? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి… గతంలో లాగా ప్రస్తుతం సైతం ఇష్టారీతిన ధాన్యం కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి…? మిల్లు కెపాసిటీ తో సంబందం లేకుండా కేటాయింపులు జరిగాయని అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి…జిల్లా కలెక్టర్ ఇటీవల ధాన్యం కేటాయింపు విషయంలో నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను ఏమాత్రం పాటించకుండా ధాన్యం కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది..అంతేకాదు బకాయి లో టాప్ టెన్ లో ఉన్న మిల్లర్లు సైతం తమకు ధాన్యం కేటాయిస్తారనే ఆశతో ఉండగా ఈ టాప్ టెన్ లో ఉన్న ఓ మిల్లర్ 18 కోట్లకు పైగా బకాయి ఉన్న ధాన్యం కేటాయించినట్లు తెలిసింది…అధికారిక లెక్కల్లోనే కొందరు మిల్లర్లు కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని తెలిసిన..మరి ఇలాంటి మిల్లర్లకు ధాన్యం కేటాయించి అధికారులు స్నేహ హస్తాన్ని ఎందుకు అందించారో అధికారులకే తెలియాలి…బకాయి మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశాలను పాటించకుండా హడావుడిగా ధాన్యం ఎందుకు కేటాయించారో వారికే తెలియాలి…అప్పటికే హన్మకొండ జిల్లాలో జరిగిన ధాన్యం భారీ స్కామ్ రాష్ట్రం లోనే సంచలనం కలిగించింది… దీని నుంచైనా పాఠం నేర్చుకొని అధికారులు కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరించ కుండా ఓ బకాయి మిల్లర్ కు టన్నుల కొద్ది ధాన్యం కేటాయించినట్లు సమాచారం…ఇంతగా బకాయి ఉండి బకాయి మిల్లర్లలో టాప్ టెన్ లో ఉన్న ఆ మిల్లర్ కు అధికారులు ఎందుకు ధాన్యం కేటాయించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…కాగా శనివారం సాయంత్రమే ధాన్యం కేటాయింపు పూర్తి చేసిన అధికారులు కేటాయింపు వివరాలను ఇంకా వెల్లడించకుండా వాటిని గోప్యంగా ఉంచి సోమవారం వెల్లడించనున్నట్లు తెలిసింది…
లీజు మిల్లులకు కేటాయింప చేస్తాం…?
మిల్లులు లీజ్ కు తీసుకొని నడిపిస్తున్న యాజమాన్యాలకు ధాన్యం కేటాయించేలా చేస్తామని ఓ మిల్లర్ అత్యుత్సాహం చూపుతున్నట్లు తెలిసింది…తాను అధికారులతో మాట్లాడి బి జి (బ్యాంక్ గ్యారెంటీ) లేకున్నా ధాన్యం కేటాయించేలా చేస్తామని ఆ మిల్లర్ ఇప్పటికే వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…డబ్బులు ఇస్తే ధాన్యం కేటాయించేలా చేస్తామని అతగాడు లీజు కు నడుపుతున్న మిల్లర్లను పిలిచి ఓ సమావేశం నిర్వహించి వసూళ్ల దందా కు తెర తీసినట్లు తెలియవచ్చింది….
టాప్ టెన్ లో బకాయిలు ఇలా..
వీరభద్ర రైస్ మిల్ 100% దాన్యం నమోదైతే 26.88% సీఎంఆర్ పెట్టడం జరిగింది.. ధాన్యం కేటాయించబడింది 256 కానీ సీఎంఆర్ పెట్టింది 69 ఏసీకే ఇంకా పెట్టాల్సింది 187
శ్రీశైలం మల్లన్న రైస్ మిల్ 100% దాన్యం నమోదైతే 28.44% సీఎంఆర్ పెట్టడం జరిగింది ధాన్యం కేటాయించబడింది 210 ఏసీకేలు అయితే 60 ఏసీకే మాత్రమే పెట్టడం జరిగింది
ఇంకా పెట్టాల్సింది 151
సాంబశివ రైస్ మిల్ 100% ధాన్యం నమోదైతే 11.16% మాత్రమే పెట్టడం జరిగింది మొత్తం నమోదైన ధాన్యం 125 అయితే 14 మాత్రమే పెట్టడం జరిగింది ఇంకా పెట్టాల్సిన ధాన్యం 111
లక్ష్మీ నరసింహ రైస్ మిల్ గట్ల కనపర్తి మొత్తం నమోదైన ధాన్యం 100 శాతం అయితే 38శాతం మాత్రమే పెట్టడం జరిగింది నమోదైన ధాన్యం 114 ఏసీకే పెట్టిన ధాన్యం 44 ఏసీకే పెట్టాల్సింది 70 శాతం
మల్లికార్జున పోచారం నమోదైన ధాన్యం 100% పెట్టింది 38 శాతం కేటాయించబడిన ధాన్యం 114 అయితే 45 ఏసీకే మాత్రమే పెట్టడం జరిగింది పెట్టాల్సింది 69
మణికంఠ బాయిల్డ మిల్
143 ఏసీకేలు కేటాయిస్తే 37 ఏసీకేలు పెట్టడం జరిగింది ఇంకా 160 ఏ సి కే లు బకాయి ఉన్నాయి
సి ఎం ఆర్ సమర్పించే గడువు పెంచి పెంచిన గడువు ఈ నెల 30 తో ముగిస్తున్న బకాయి మిల్లర్లు ఇంకా సి ఎం ఆర్ పెట్టనున్న శనివారం సాయంత్రం వారికి ధాన్యం కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది…



