న్యూస్ 10 ఎఫెక్ట్…
118 సర్వే నెంబర్లోని అనధికారిక వెంచర్ పై న్యూస్ 10 వరుస కథనాలకు స్పందించిన మున్సిపల్ ,రెవెన్యూ అధికారులు…
జే సీ బీ సహాయంతో వెంచెర్లోని హద్దు రాళ్లు తొలగించిన అధికారులు..
నాన్ లే అవుట్ వెంచెర్లో భూములు కొనుగోలు చేయరాదని ప్రజలకు సూచించిన తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్..
డీ టీ సీ పీ అనుమతులు లేకుండా ప్లాట్ల వెంచర్లు నిర్మిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక…
తొర్రూరు పట్టణ శివారులోని 118 సర్వే నెంబర్ భూమిలో 12 ఎకరాల్లో ఓ రియల్టర్ నిర్మించిన అనధికారిక లే అవుట్ వెంచర్ పై న్యూస్ 10 ప్రచురించిన వరుస కథనాలకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించారు .నాలా కన్వర్షన్, స్థానిక మున్సిపాలిటీ, డీ టీ సీ పీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన వెంచర్ పై న్యూస్ 10 దినపత్రిక వరుస కధనాలు ప్రచురించిన విషయం తెలిసిందే..ఈ నేపధ్యంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు వెంచెర్లో ని హద్దురాళ్లను జేసీబీ సహాయంతో తొలగించారు.అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించి ప్లాట్ల అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వెంచేర్ ను పూర్తిగా కూల్చివేసి ప్రజలు ఎవ్వరు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించే వెంచర్లలోని ప్లాట్లను కొనుగోలు చేయరాదని హెచ్చరించారు.డీ టీ సీ పీ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్ హెచ్చరించారు.హద్దు రాళ్లు తొలగించిన వారిలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తో పాటు స్థానిక మున్సిపల్ సిబ్బంది ఉన్నారు…







