మావోయిస్టు అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కోసం గ్రేహండ్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిసింది…దామోదర్ కోసం కూంబింగ్ చేస్తున్న పోలీసులు ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో జల్లెడ పడుతున్నారు… కాగా మేడారం అటవీ ప్రాంతం లో దామోదర్ అలియాస్ బడే చొక్కారావు షెల్టర్ తీసుకున్నారన్న పక్కా సమాచారం తో పోలీసులు కూంబింగ్ చేస్తున్నట్లు సమాచారం… దామోదర్ ఈ ప్రాంతంలో ఉన్నాడన్న ఇంటలిజెన్స్ సమాచారంతో కూంబింగ్ రంగంలోకి దిగిన పోలీసులు ములుగు, పస్రా, తాడ్వాయి ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది… ఈ కూంబింగ్ నేపథ్యంలో చత్తిస్గడ్ రాష్ట్రం నుంచి తెలంగాణ లోకి రాకుండా పోలీసులు పహార కాస్తున్నట్లు తెలిసింది… భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రధాన రహదారులపై చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు… ఇదిలావుంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం కావడంతో ఈ మండలం న్లో టెన్షన్ వాతావరణం నెలకొంది…కాగా కర్రెగుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది.. వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..



