ఖాజీపేట దర్గాలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది… గురువారం ఇక్కడ నుంచి నిర్వహించే ఛత్రపతి శివాజీ శోభ యాత్ర కోసం ఏర్పాట్లు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది… శోభా యాత్రకు ఏర్పాట్లలో భాగంగా ఐరన్ పైపులు పైకి లేపగా అక్కడే ఉన్న 11కేవి విద్యుత్ వైర్లకు పైప్ తగిలి షాక్ తగిలినట్లు తెలిసింది… ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఖాజీపేట సిఐ సుధాకర్ రెడ్డి అక్కడకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు… ఈ సంఘటన విషయంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….





