ధాన్యం భారీ స్కాం నిందితుల అరెస్ట్.
ఈ ఏడాది రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరిగిన భారీ స్కాంలో శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు క్రైమ్ నెంబర్ 196/2025 లోనీ నేరస్థులలో కాట్రపల్లి గ్రామానికి చెందిన వాంకుడోత్ చరణ్ డాటా ఎంట్రీ ఆపరేటర్, కాట్రపల్లి క్లస్టర్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ అల్లే అనిత లను అరెస్ట్ చేసినట్లు పరకాల ఎసిపి సతీష్ బాబు, శాయంపేట సిఐ పి రంజిత్ రావు తెలిపారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్యాబ్ ఆపరేటర్ గా పనిచేసిన చరణ్ నుండి 20 వేల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్ ను, కాట్రపల్లి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ అనిత వద్ద ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ట్యాబ్ ను, టోకెన్ షీట్ బుక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



