ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి…?

హన్మకొండ జిల్లాలో జరిగిన ధాన్యం స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారింది…ఈ స్కామ్ లో సూత్రధారులు ఎవరు..?పాత్ర దారులు ఎవరు అనే కోణంలో విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు…జిల్లాలోని ఒక్క శాయంపేట మండలంలో లోనే ధాన్యం లేకుండా 75 లక్షలు స్కామ్ చేశారు అంటే ఆత్మకూర్ మండలంలో ఏమేరకు స్కామ్ జరిగిందనే దానిపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు…ఇది సి ఎం ఆర్ కు సంబంధించిందో, మిల్లర్ మర ఆడించి పక్క రాష్ట్రంలో బియ్యం అమ్ముకున్నదో కాదు…ఇది అంతకు మించి అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేని సాంబశివ రైస్ మిల్లు యజమాని ఇక్కడి వారితో కుమ్మకై నడిపించిన అవినీతి తతంగం ఇది… అసలు ధాన్యమే లేకుండా శాయంపేట మండల వ్యవసాయ అధికారి యూసర్ నేమ్ పాస్ వర్డ్ తో పోర్టల్ లో వివరాలు నమోదు చేసి సర్కార్ సొమ్ము దిగమింగిన బరితెగింపు తనం ఇది…ధాన్యం డబ్బులే కాకుండా ,రవాణా ఖర్చులు,గన్నీ బ్యాగుల డబ్బులు సైతం ఎక్కడికి వెళ్లాయి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి అని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు….

డిఎం, ఏ ఓ లకు క్లీన్ చీట్…?

ధాన్యం స్కామ్ విషయంలో శాయంపేట ఏ ఓ తనకు ఎలాంటి సంబంధం లేదని విజిలెన్స్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది… ఈ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పినట్లు సమాచారం…తనకు సంబంధించిన యూసర్ నేమ్,పాస్ వర్డ్ ఏ ఈ ఓ నమ్మకం తో ఇస్తే దానిని దుర్వినియోగ పరిచారని ఏ ఓ స్పష్టం చేయడంతో విజిలెన్స్ అధికారులు సైతం ఆ విషయంలో విషయ సేకరణ చేసి ఏ ఓ పాత్ర ఏమి లేనట్లు గా ఓ నిర్ధారణ కు వచ్చినట్లు తెలిసింది…ఇక జిల్లా పౌర సరఫరాల డి ఎం పై గన్ని బ్యాగుల విషయంలో అనుమానాలు రాగ అవినీతికి పాల్పడ్డ మిల్లరే తన వద్ద ఉన్న పాత గన్ని సంచులతో మ్యానేజ్ చేశాడని…అసలు డి ఎం నుంచి గన్ని బ్యాగులు వెళ్లలేదని విజిలెన్స్ అధికారులు తెలుసుకున్నట్లు తెలియవచ్చింది…ఈ విషయంలో డి ఎం సైతం విజిలెన్స్ అధికారులకు ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది…. దింతో ఈ స్కామ్ నుంచి ఏ ఓ,సివిల్ సప్లయీస్ డిఎం లకు క్లీన్ చీట్ వచ్చినట్లుగా భావిస్తున్నారు….

అంతా వారే నడిపారా…?

ధాన్యం స్కామ్ ను కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన సాంబశివ మిల్లు యజమాని,శాయంపేట మండలం ప్రగతి సింగారం ఏ ఈ ఓ,పత్తిపాక ఐ కే పి సెంటర్ నిర్వాహకురాలు,మరో ఇద్దరు వ్యక్తులు కలిసి నడిపినట్లు తెలుస్తుంది…శాయంపేట ఏ ఓ వద్దనుంచి యూసర్ నేమ్, పాస్ వర్డ్ తీసుకొని ప్రగతి సింగారం ఏ ఈ ఓ కాట్రపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్,మాజీ ఓ డి సి ఎం ఎస్ ఉద్యోగికి ఇవ్వడం తో అవినీతికి ఇక్కడే బీజం పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలుస్తుంది…ఈ వ్యక్తి మిల్లు యజమానితో కలిసి పోర్టల్ లో రైతుల వివరాలు ఇష్టారీతిన నమోదు చేసి స్కామ్ కు తెరలేపినట్లు తెలుస్తుంది…. మిల్లర్ తో కలిసి ఇతగాడు జమ్మికుంట ప్రాంతంలో రూ 40 లక్షలు డ్రా చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…ఐయితే ఈ విషయంలో తాను వివరాలు ఇచ్చాను తప్ప స్కామ్ లో లేనని ఏ ఈ ఓ చెబుతున్న …తాను పనిచేస్తున్న క్లస్టర్ నుంచి కాకుండా శాయంపేట క్లష్టర్ నుంచి నకిలీ రైతుల వివరాలు నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది… ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే తనకు సంబంధించిన ఐడి,పాస్ వర్డ్ తో ఇంత జరుగుతున్న శాయంపేట ఏ ఓ గమనించకపోవడం నిర్లక్ష్యంగా కనపడుతోంది…కాగా ఈ స్కామ్ లో ఐదుగురి పై కేసు నమోదు ఐయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here