పొన్నం ఇలాఖాలో ఇష్టారాజ్యం

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాఖాలో అవినీతి రాజ్యం ఏలుతున్నట్లుగా కనపడుతుంది.. కరీంనగర్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది…ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారి ,ఇతర అధికారులు ఏజెంట్లను నియమించుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి…కార్యాలయం ఆవరణలోనే ఏజెంట్ల పేరుతో అక్రమంగా వాహనదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు… ఇంత జరుగుతున్నా రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏమాత్రం చలనం లేకుండా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహహరిస్తున్నారు…ఇక్కడి వసూళ్ల భాగోతం గూర్చి రాష్ట్ర స్థాయిలో అధికారులకు అన్ని తెలిసిన ఎం తెలియనట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి….ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటుండడం వల్ల కరీంనగర్ ఆర్టిఏ వసూళ్ల భాగోతం విషయంలో వారు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి…దానికి తగ్గట్టుగా రవాణా శాఖ ఉన్నతాధికారులు సైతం ఆ అధికారులపై చర్యలు ,అవినీతి ప్రక్షాళన చేపట్టకపోవడం వల్ల ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లు అవుతుంది…రవాణా శాఖ ఉన్నతాధికారులే ఇలా వ్యవహరిస్తే కరీంనగర్ ఆర్టిఏ లో అడ్డగోలు వసూళ్లకు చెక్ పెట్టేది ఎవరని …?వాహనదారులు ప్రశ్నిస్తున్నారు…ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు నిద్ర నటించడం మాని అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని అక్రమ వసూళ్ల భాగోతానికి చెక్ పెట్టాలని కోరుతున్నారు..ఇదిలావుండగా సాక్షాత్తు తన ఇలాఖలోని కరీంనగర్ ఆర్టిఏ కార్యాలయంలో ఇక్కడి అధికారులు అడ్డగోలు అక్రమ వసూళ్లు చేస్తున్న వ్యవహారంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి…కరీంనగర్ ఆర్టిఏ లో కొనసాగుతున్న అక్రమ వసూళ్ల పై మంత్రి పొన్నం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి…కాగా రవాణా శాఖ మంత్రి ఇలాఖాలోని ఆర్టిఏ కార్యాలయం లోనే ఇలా అక్రమ వసూళ్ల భాగోతం యథేచ్ఛగా కొనసాగితే మిగతా రవాణా శాఖ కార్యాలయాల పరిస్థితి ఎంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి… ఇకనైనా రవాణా శాఖ మంత్రి ఈ ఆర్టిఏ కార్యాలయం పై దృష్టి పెట్టి అక్రమార్కుల పని పట్టాలని పలువురు కోరుతున్నారు…ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here