అసలు ధాన్యం లేదు, గన్ని బ్యాగులు లేవు,ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసింది లేదు కానీ సర్కార్ సొమ్మును మాత్రం భారీగా నొక్కేశారు…ఓ మిల్లర్ జోక్యంతో ఏ ఓ ,ఏ ఈ ఓ లు ఓ ప్రయివేట్ వ్యక్తి సాయంతో ధాన్యం వివరాలు సర్కార్ సైట్ లో నమోదు చేసి అందినకాడికి దండుకున్నారు…ఓ మిల్లర్ భార్య, భార్య,కూతురు,కుమారుడు,అల్లుడు పేరుతో ధాన్యం వివరాలు నమోదు చేసి ధాన్యం కుంభకోణానికి తెర తీశారు…ఇప్పుడు ఈ విషయంలో విజిలెన్స్ తీగ లాగడంతో కుంభకోణం డొంక కదులుతుంది..ముఖ్యంగా శాయంపేట మండలం కేంద్రంగా కుంభకోణం భారీగా జరిగినట్లు విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తెలినట్లు తెలుస్తుంది… ఈ విచారణలో విజిలెన్స్ అధికారులే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నట్లు సమాచారం…రాష్ట్రంలో సివిల్ సప్లయీస్ ఇలా ఏమాత్రం ధాన్యం లేకుండా ఇంతటి స్కామ్ జరగడం చర్చనీయాంశంగా మారింది…ఈ స్కామ్ పై విచారణ చేసేందుకు విజిలెన్స్ ఎస్పీ ,డిఎస్పీ స్థాయి అధికారులు శాయంపేటకు వచ్చినట్లు తెలుస్తోంది…ఈ ధాన్యం కుంభకోణం లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశంలో కూపీ లాగుతున్నట్లు తెలియవచ్చింది…కాగా ఓ మిల్లర్ సతీమణి బ్యాంక్ ఖాతా లో ధాన్యం డబ్బులు 24 లక్షలు జమ కావడంతో అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు ఆరా తీయడంతో ధాన్యం స్కామ్ బయటపడినట్లు తెలుస్తుంది….ధాన్యం ఏమాత్రం లేకుండా మిల్లర్ కుటుంబ సభ్యలను,ఇతరులను రైతులుగా పేర్కొంటూ కేవలం కాగితాలపై లెక్క చూపించి గాలి లెక్కలతో స్కామ్ చేయడం విజిలెన్స్ అధికారులనే విస్మయానికి గురిచేసింది…ట్రక్ షీట్స్,రశీదులు,గన్ని బ్యాగ్స్ ,ట్రాన్స్ పోర్ట్ వివరాలతో దొంగ లెక్కలు నమోదు చేసి కోట్లల్లో సర్కార్ సొమ్మును కొట్టివేసినట్లు విజిలెన్స్ అధికారులు విచారణలో తేలింది….మంగళవారం హైదరాబాద్ నుంచి హన్మకొండ చేరుకున్న విజిలెన్స్ ప్రత్యేక బృందం దీనిపై విచారణ కొనసాగిస్తోంది…బుధవారం హన్మకొండ కలెక్టరేట్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ కొనసాగించారు….
స్కామ్ జరిగిన తీరు ఇది…?
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్న సాంబశివ మిల్లు రైస్ మిల్లు యజమాని శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఓ ఐకేపీ సెంటర్ నిర్వహకురాలితో ఓ ఒప్పందం కుదుర్చుకుని మిల్లర్ ఈ భారీ స్కామ్ కు తెర తీసినట్లు తెలిసింది..మండలంలోని ప్రగతి సింగారం ఏ ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి,గతంలో ఓ డి ఎం ఎస్ లో పనిచేసిన ఇదే మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి,పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన మరో వ్యక్తి కలిసి గుట్టుగా స్కామ్ చేసినట్లు సమాచారం…శాయంపేట మండలానికి చెందిన వ్యవసాయ అధికారి ఆధీనం లో ఉండే లాగిన్స్,పాస్ వర్డ్ తీసుకొని ఏ ఈ ఓ ధాన్యం వివరాలు పోర్టల్ లో నమోదు చేసి స్కామ్ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తెలినట్లు తెలిసింది…ఈ విషయాన్ని ఏ ఈ ఓ సైతం అంగీకరించినట్లు తెలియవచ్చింది….ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలి సాయంతో ట్రక్ షీట్ లు పొంది…పోర్టల్ లో జమ్మికుంటకు చెందిన 34 మంది పేర్లను నమోదు చేసి ఒక్క శాయంపేట మండలం కేంద్రం గా రూ 75 లక్షలు కొట్టేసినట్లు విజిలెన్స్ నిర్దారించినట్లు సమాచారం…సహకరించినందుకు ఏ ఈ ఓ,ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలి తో సహా మరో ఇద్దరు వ్యక్తులకు మిల్లర్ బస్తా కు రెండు రూపాయలు చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం…
అతిపెద్ద స్కామ్…?
ఇప్పటివరకు మనం సర్కార్ నుంచి ధాన్యం తీసుకొని సి ఎం ఆర్ పెట్టకుండా ధాన్యం మర ఆడించి అమ్ముకొని సొమ్ము చేసుకున్న మిల్లర్ల అవినీతి గురించి విన్నాం కానీ సాంబశివ మిల్లు ఓనర్ మాత్రం సరికొత్త స్కామ్ కు తెర తీశాడు… ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు, ఏ ఈ ఓ,మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో ధాన్యం లెక్కలు కాగితాలపైనే చూపించి…అసలు ధాన్యమే లేకున్నా ట్రక్ షీట్ లు అప్ లోడ్ చేసి తనకు చెందిన వారి పేర్లను రైతులు గా పోర్టల్ లో నమోదు చేయించి భారీగానే స్కెచ్ వేసాడు…తన భార్య,కూతురు,కుమారుడు,అల్లుడు పేరుతో సహా ఒకే ప్రాంతానికి చెందిన మొత్తం 34 మంది పేర్లు ఎంటర్ చేయడం,మిల్లర్ సతీమణి ఖాతాలో ఒకేసారి రూ 24 లక్షలు ధాన్యం డబ్బులు జమ కావడంతో మిల్లర్ విజిలెన్స్ కు అడ్డంగా దొరికిపోయినట్లు తెలిసింది…”తీగ లాగితే డొంక కదిలినట్లు”” స్కామ్ లో పాత్ర దారులు మొత్తం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది… అయితే ఈ స్కామ్ కు సూత్రధారులు ఎవరో కూడా కూపీ లాగే పనిలో విజిలెన్స్ ఉన్నట్లు సమాచారం…కాగ ఈ స్కామ్ తెలంగాణ లోనే రెండవ అతిపెద్ద స్కామ్ గా విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు…ఆత్మకూర్ మండలం కేంద్రం గా కొనసాగిన స్కామ్ పై సైతం విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు…ఇక్కడ పనిచేస్తున్న ఏ ఓ,ఏ ఈ ఓ ల వ్యవహారం పై కూపీ లాగుతున్నట్లు తెలియవచ్చింది…
స్కామ్ లో శాయంపేట ఏ ఓ పాత్ర ఎంత….?
గన్ని బ్యాగ్స్, రవాణా ఖర్చుల సంగతేంటి….?
డి ఎం,ఇంచార్జ్ డి ఎస్ ఓ పాత్ర పై అనుమానాలు…?
మరో సంచికలో….





