రెండు రోజుల క్రితం న్యూస్ 10 దినపత్రికలో ప్రచురించిన “తొర్రూరులో రియల్టర్ మాయాజాలం” కథనానికి మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు.సర్వే నెంబర్ 118 లో అనధికారికంగా నిర్మిస్తున్న పన్నెండు ఎకరాల పైచిలుకు నాన్ లే అవుట్ వెంచర్ను పరిశీలించారు. మున్సిపల్ ,టౌన్ ప్లానింగ్, రెవిన్యూ శాఖల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా నిర్మిస్తున్న వెంచెర్లో ని ప్లాట్లను ఎవరు కొనుగోలు చేయరాదని హెచ్చరిక బోర్డ్ పెట్టారు. అనంతరం 118 సర్వే నంబర్లో భూమి కలిగిన ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేసి ఒకటి రెండు రోజుల్లో ఇతర శాఖల సమన్వయంతో వెంచర్లోని హద్దు రాళ్లను తొలగించి పూర్తిగా కూల్చివేస్తామని హెచ్చరించారు…



