ఈ హిడ్మా ఆ హిడ్మా కాదు



కోరాపుట్ అటవీ ప్రాంతంలో కుంజా హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకే 47 తో సహా మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కుంజా హిడ్మా, ఒడిశాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టు దళ సభ్యుడు. కాగా, ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్యం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మడివి హిడ్మా, కుంజా హిడ్మా ఇద్దరూ వేరువేరు.మడివి హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ [పీఎల్జీఏ] బెటాలియన్ 1 కు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. 2021 మార్చిలో మాటువేసి 22 మంది భద్రతా బలగాలను హతమార్చిన మడివి హిడ్మా కోసం గత కొంతకాలంగా ఛత్తీస్ ఘడ్ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మడివి హిడ్మాపై ₹40 లక్షల రివార్డు సైతం ఉంది.అయితే కుంజా హిడ్మా అరెస్ట్ తో అందరూ మడివి హిడ్మా అనుకున్నారు కానీ కాదు..పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ [పీఎల్జీఏ] బెటాలియన్ 1 కమాండర్ మడివి హిడ్మా కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు…అత్యధిక భద్రత వలయంలో ఉండే మడివి హిడ్మా కోసం పోలీసులు వెతుకుతున్నారు….



