మిస్ వరల్డ్ గా థాయిలాండ్ సుందరి…కిరీటం దక్కించుకుంది…మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. శనివారం హైదరాబాద్లోని హెటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ఫినాలేలో విజేతగా నిలిచి 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.టాప్ 8లో చోటు దక్కకపోవడంతో మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ దేశ అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు.



