మద్యం సేవించిన డబ్బులు కట్టకపోతే కుల బహిష్కరణ.?
ప్రగతి సింగారం లో పనికిమాలిన పెద్ద మనుషులు
పంచాయతీలో డిపాజిట్ పెట్టలేదనే నెపంతో..
2 రోజులు తాము మద్యం సేవించిన 15 వేల రూపాయలు చెల్లించాలని పెద్ద మనుషుల హుకుం…
డబ్బులు చెల్లించ లేదనే కోపంతో కుల బహిష్కరణ…
సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నాము తప్ప ఆచరణలో ఎక్కడ నిరూపించిన దాఖలాలు కొసమెరుపే.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పెద్ద మనుషులు తమ మాట వినడం లేదని కుల బహిష్కరణ పేరుతో ఆత్మగౌరవాన్ని అంగట్లో సరుకులాగా వేలం వేస్తున్నారు. ఇది సరికాదని ప్రశ్నించిన వారిపై కుల బహిష్కరణ పేరుతో నయవంచనకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడడం పరిపాటయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు పెద్ద మనుషుల వికృత చేష్టలకు సాక్షాలుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే… శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్న నేపథ్యంలో పెద్దమనుషుల సమక్షంలో ఒకరు మరో వ్యక్తిపై పంచాయతీకి పిలిపించాలని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పంచాయతీ నిర్వహించారు. అయితే సదరు వ్యక్తి డిపాజిట్ చెల్లించకపోగా పెద్దమనుషులను కించపరిచారనే సాకుతో కుల బహిష్కరణ చేసినట్లు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓకే సోమాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుని పెద్ద మనుషుల సమక్షంలో ఏర్పాటుచేసిన పంచాయతీకి పిలిపించి డిపాజిట్ చెల్లించాలని లేదంటే కుల బహిష్కరణ చేస్తామని పెద్ద మనుషులు నిర్ణయం తీసుకుని 10 వేల రూపాయల మద్యం సేవించి మళ్లీ మరుసటి రోజు 5 వేల రూపాయల మద్యం సేవించి మొత్తం 15 వేల రూపాయల మద్యం సేవించిన రూపాయలు చెల్లించాలని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి హుకుం జారీ చేశారు.2 రోజులపాటు మద్యం సేవించిన బిల్లు మొత్తం చెల్లించాలని లేదంటే కుల బహిష్కరణ చేస్తామని పెద్ద మనుషులు నిర్ణయం తీసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే బాధితుడు మాత్రం తను తిట్టడం వలన తిరిగి నేను తిట్టానని డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించడంతో పెద్ద మనుషులంతా కుట్రపూరితంగా నాపై కక్ష కట్టి 15 వేల రూపాయలు చెల్లిస్తేనే కులంలో ఉండాలని లేదంటే కుల బహిష్కరణ తప్పదని పెద్ద మనుషులు బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. గ్రామ పెద్ద మనుషులు పంచాయతీకి పిలిస్తే రాకపోతే దాని పర్యవసానం ఇలాగే ఉంటుందని తరతరాలుగా వచ్చిన ఆనవాయితీ అని పంచాయతీకి వచ్చినవాళ్లు ఊరికే వెళతారా.. అంటూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్ద మనుషులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల పేరుతో పెద్ద మనుషులు చేసే వికృత చేష్టలు బయటకు రానివి ఎన్నో..



