బదిలీ కై పైరవీలు…?

నిబంధనలకు తిలోదకాలిచ్చి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి మరకలు అంటిన రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అధికారులు వాటిని కడుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది..
రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు అధికారులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బదిలీలు చేసిన అవినీతి కి మాత్రం ఆ శాఖ ఉన్నతాధికారులు అడ్డుకోలేకపోతున్నారు… తమను ప్రసన్నం చేసుకుంటే చాలు ఆక్రమాన్ని సక్రమం చేసి అడ్డగోలు రిజిస్ట్రేషన్ లు చేసే కొందరు అధికారుల మూలంగా శాఖ పరువు పోతుందని అపవాదు సైతం లేక పోలేదు…కాగా ఇటీవల వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంచార్జ్ సబ్ రిజిస్టార్ గా పనిచేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంతో సస్పెండ్ కు గురై ఆతర్వాత వైరా కు బదిలీ ఐయి తీరు మార్చుకోక మళ్ళీ సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య వ్యవహారం శాఖలో హాట్ టాపిక్ గా మారింది…ఈ సస్పెండ్ వల్ల అధికారుల్లో గుబులు మొదలయ్యింది…

ఆ సబ్ రిజిస్ట్రార్ అంతే…?

వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి స్టేషన్ ఘనపూర్ బదిలీ కాగా ఆతర్వాత జనగామ బదిలీ అయ్యారు…ఈ సబ్ రిజిస్ట్రార్ అవినీతి ఆరోపణలు ఎక్కువ కావడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం ఐయినట్లు తెలుస్తుంది… ఇతగాడి అక్రమ రిజిస్ట్రేషన్ ల వ్యవహారంపై ఇటీవల విజిలెన్స్ సైతం ఆరా తీసి వివరాలు సేకరించి ఓ నివేదిక తయారు చేసినట్లు తెలిసింది…దింతో ఈ సబ్ రిజిస్ట్రార్ లో గుబులు మొదలయ్యి బదిలీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం… బదిలితో తాను అక్రమాలు చేశాడని వస్తున్న ఆరోపణలు తగ్గిపోతాయనో…అవినీతి అపవాదు సమసి పోతుందని అనుకున్నాడో ఏమో తెలియదు కాని బదలీ కి బాగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టాక్ నడుస్తుంది…నల్గొండ జిల్లాకు బదిలీ చేసుకోవాలని అది కుదరకుంటే మరో జిల్లాను ఎంచుకోవాలని ఆ సబ్ రిజిస్ట్రార్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది…..ఇంతకీ ఈ సబ్ రిజిస్ట్రార్ కు ఉన్నతాధికారులు బదిలీ బహుమానం ఇస్తారా…? లేక చర్యలు తీసుకుంటార…? చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here