కబ్జాల కానిస్టేబుల్

ఆయనో కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంటే కేవలం పేరుకు మాత్రమే..ఆయన చేసే వృత్తి కానిస్టేబులే అయిన ప్రవృత్తి మాత్రం కబ్జాలు చేయడమేనట… తన ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకొని అమాయకుల భూములపై కర్చీఫ్ వేసి అవసరమైతే తన శాయశక్తులా ప్రయత్నించి అవసరమైన నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి పై పాగా వేసి అసలుదారులను ముప్పుతిప్పలు పెట్టడమే అతని పనట… అంతే కాదు తాను కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు కనుక ఆ శాఖ లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి కేసులు పెట్టించడం లేదంటే తన సామాజిక వర్గం పేరుచెప్పి కులం కార్డు వాడి బయపెట్టడం ఇతగాడికి నిత్యకృత్యం గా మారిందట…హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్న ఇతగాడు ఇప్పటికే రెండు సార్లు సస్పెండ్ ఆయన పోలీస్ ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించిన తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా భూ తగాదాలు,కబ్జా ల్లో తలదూర్చి తన తండ్రి,సోదరుని పేర స్థానిక పోలీస్ స్టేషన్ లల్లో అసలుదారులపైనే కేసులు పెట్టిస్తూ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు భాదితులు లబోదిబోమంటున్నారు… కాగా హన్మకొండలోని ఓ భూమి వ్యవహారంలో తనకు తెలిసిన పోలీసు పరపతితో భాదితుణ్ణి ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలియవచ్చింది…ఓ వ్యక్తి భూమినే కబ్జా చేసి పైగా భాదితుడిపైనే ఎలాంటి విచారణ చేయకుండా భాదితుడిపైనే రెండు కు పైగా కేసులు పెట్టి మానసికంగా వేదిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…. ఆ కానిస్టేబుల్ భూ ఆగడాలతో విసిగివేసారిన ఓ భాదితుడు న్యూస్10 ను ఆశ్రయించాడు..గత కొద్ది సంవత్సరాలుగా తన సొంత భూమిలోకి తాను వెళ్లేందుకే ఎంతగా భాధ పడాల్సివస్తుందో…పూసగుచ్చినట్లు చెప్పాడు…ఇంతకీ ఎవరా కానిస్టేబుల్ ఏమా కబ్జా దందా పూర్తి ఆధారాలు ,వివరాలతో బాధితుడి మాటల్లో రేపటి సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here