అధ్యక్షురాలిపై అసంతృప్తి…!

హన్మకొండ జిల్లా బీజేపీ లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి… ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి… పార్టీ జిల్లాలో బలోపేతం కావాదానికి తాను ఏమాత్రం కృషి చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి…రావు పద్మ వ్యవహారశైలిపై కొందరు బీజేపీ నాయకులు ఏకంగా రాష్ట్ర,జాతీయ నాయకులకు ఫిర్యాదులు చేశారు…హన్మకొండ జిల్లాకు చెందిన కొందరు బీజేపీ నాయకులు పార్టీ క్రమశిక్షణ కమిటీకి లిఖిత పూర్వకంగా తమ ఫిర్యాదును అందజేసినట్లు ఆలస్యంగా తెలియవచ్చింది… నవంబర్ నెలలో కొందరు పార్టీ నాయకులు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి పిర్యాదు చేసినట్లు తెలిసింది….భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్,మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కు లేఖ అందజేసిన నాయకులు ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు…. హనుమకొండ జిల్లా, దీన్ దయాళ్ నగర్ లో గల భారతీయ జనతా పార్టీకి సంభంధించిన స్థలం,
కార్యాలయం భవన నిర్మాణం, పార్టీ కార్యక్రమాలను పార్టీ అధ్యక్షురాలికి సంభంధించిన వ్యక్తిగత కార్యాలయంలో నడుపుటపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు….అంతేకాదు ఈ మధ్య కాలంలో సభ్యత్వ నమోదు గురించి తాము హనుమకొండ జిల్లాలోని పలు బూత్ లలో పర్యటిస్తున్న క్రమంలో కొంత మంది కార్యకర్తలు కొన్ని విషయాలు లేవనెత్తారరని,.దీని వల్ల పార్టీకి సభ్యత్వం తక్కువ అవ్వడమే కాకుండా, పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తాము భావిస్తున్నామని అన్నారు
బీజేపీ కార్యాలయ స్థలం వివాదంలో ఉందని కొంత మంది కార్యకర్తలు అంటున్నారని,దీనిపై పూర్తి స్పష్టత జిల్లాలోని ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు ఇస్తే,మన పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదుగగలదని తాము భావిస్తున్నామని,తెలంగాణలోని చాలా జిల్లాల్లో అధునాతనంగా కార్యాలయాలు నిర్మించారని మన జిల్లాలో ఎప్పుడు నిర్మిస్తారని అందరూ అడుగుతున్నారని,. హన్మకొండ జిల్లాలో కార్యాలయం నిర్మిస్తే, సంస్థాగతంగా పార్టీ మరింత బలపడుతుందని లేఖలో చెప్పారు… ఇప్పుడున్న హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు, తన వ్యక్తిగత కార్యాలయంలో కొన్ని పార్టీ కార్యక్రమాలు నడుపుచున్నారని, దీనివల్ల చాలా మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు రాలేకపోవుతున్నారని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని,జిల్లా అధ్యక్షురాలు కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే పరిమతమయ్యారని వారు లేఖలో ఆరోపించారు…అలాగే
అధికారికంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్ లలో జిల్లాలో జరిగే అన్ని కార్యక్రమాలు పోస్ట్ చేయడం లేదని,ఒకే ఒక్కరి భజన మాత్రమే చేస్తూన్నారని. పార్టీ పెద్దలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు
మూడు పర్యాయాలు తాను అధ్యక్షురాలిగా కొనసాగిన ఇప్పటివరకు అందరినీ తాను కలుపుకుపోవడం లేదని, కొంత మంది అంటున్నారని,దీనిపై కూడా విచారణ జరపాలని వారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ను వారు లేఖలో కోరారు..వస్తున్న ఆరోపణలు విషయాలన్నింటి పై విచారణ జరిపి, భాధ్యులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకుపోగలరని వారు లేఖలో విజ్ఞప్తి చేశారు… కాగా ఈ బీజేపీ నాయకులు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి అందించిన లేఖ హన్మకొండ జిల్లా బీజేపీ లో హాట్ టాపిక్ గా మారింది…ఈ లేఖ ఆధారంగా రావు పద్మ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది…. జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి అధ్యక్షురాలు ఏమాత్రం కృషి చేయడం లేదని కొందరు నాయకులు అంటున్నారు….

అవును పిర్యాదు చేసాం….

నాంపల్లి శ్రీనివాస్,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్..

హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలి వ్యవహార శైలిపై తాము రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు పిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాంపల్లి శ్రీనివాస్ తెలిపారు… లేఖ అందజేసిన విషయంపై ఆయన న్యూస్10 తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు…మొన్నటివరకు అధ్యక్షురాలిగా కొనసాగిన రావు పద్మ వల్ల పార్టీ కనీసం హన్మకొండ గడప దాటలేకపోయిందన్నారు…
రాష్ట్ర ,జాతీయ నాయకులను కలిసి తాము పిర్యాదు చేశామని చెప్పారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here