వరాల తల్లి, బంగారు తల్లి సమ్మక్క వనం నుంచి బయలుదేరింది… మరికొద్ది క్షణాల్లో సమ్మక్క తల్లి గద్దె పై కొలువుదీరనుంది… సమ్మక్క రాకను స్వాగతిస్తు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాది కేకన్ గాలిలోకి కాల్పులు జరిపారు… సమ్మకం రాక కోసం చిలుకల గట్టునుంచి సమ్మకం గద్దెల వరకు ముగ్గులతో భక్తులు అలంకరణ చేశారు…. సమ్మకం వస్తున్న ఉద్విజ్ఞ క్షణాల్లో భక్తులు ఎదురుకోళ్లు సమర్పించి భక్తితో తనివి తీరా మొక్కారు… జై సమ్మక్క అంటూ నిన దించారు…



