మేడారం..మహా జాతరలో కీలకఘట్టం సమ్మక్క ఆగమనం నేడే.. గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి చిలుకల గట్టు
వనం నుండి జనం లోకి రానుంది..చిలుకల గట్టు వద్ద ప్రత్యేక పూజల అనంతరం పూజారులు
అక్కడి నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెల పైకి తీసుకురానున్నారు.. భక్తుల జయ జయ ద్వానాలు, శివ సత్తుల పూనకాలు, భక్తుల ఎదుర్కొల్ల మధ్య సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరనుంది… బంగారు తల్లి రాక కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు…కాగా
మూడంచెల భద్రత మధ్య గద్దెల పైకి సమ్మక్క తల్లి రానుంది… తల్లి రాకకు
గౌరవ సూచికగా గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్ నాది కేకన్ స్వాగతం పలుకనున్నారు…సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్త జనం ఎదురుచూస్తుండగా
ఇప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లు కొలువు దీరారు….



