వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత లో కీలక పరిణామం చోటుచేసుకుంది… భూదాన్ భూముల్లోనే అక్కడ ఇదివరకు నివాసం ఉండి ఇళ్ళు కోల్పోయిన వారికి ఇక్కడే పట్టాలు ఇస్తున్నట్లు తెలిసింది… ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్ లో దాదాపు మూడు వందల పదకొండు మందికి టోకెన్లు పంపిణి చేశారు…రేపు ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా వారికి పట్టాలు పంపిణి చేయనున్నట్లు తెలుస్తుంది…అదే భుదాన్ 30 ఎకరాల భూమిలో ఐదారు ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.. ఒక్కొకరికి 75 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నారు….కాగా ఖమ్మం వెలుగుమట్ల లో సర్కార్ 700 ఇండ్లు కూల్చగా , కేవలం 311 మందినే బాధితులుగా అధికారులు చెబుతుండడం వారికే టోకెన్లు ఇవ్వడంతో తమ పేర్లు రాకపోవడంతో ఆందోళనగా మిగతా బాధితులు కలెక్టరెట్ చేరుకున్నారు…



