మానుకోట ఆర్టిఏ లో సాయి లీలలు…?

కార్యాలయం అంతా ఆయనదే పెత్తనం..అక్రమ వసూళ్లు హక్కు అయినట్లు ప్రశ్నిస్తే బెదిరింపులకు కూడా దిగుతాడు…ఓ అడుగు ముందుకు వేసి అదేదో నిషేధిత ప్రాంతం అయినట్లు మీరు కార్యాలయానికి ఎందుకు వచ్చారు…?మా పైనే వార్తలు రాస్తారా…?అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతాడు…జర్నలిస్టుల పేరుతో కార్యాలయానికి వచ్చి చెప్పింది చెప్పినట్లు విని ఫీల్ గుడ్ అంటూ జీ హుజూర్ అంటూ తనకు బాకా ఊదే వారి మాటలు విని తన నోటికి పని చెపుతున్నాడు ఆ అధికారి…ఇదంతా ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జరుగుతున్న తతంగం ఇది…అక్రమ సొమ్ము లేనిదే ఇక్కడ పైల్ కదలడం లేదు…ఏజెంట్లు,బ్రోకర్లు, హోం గార్డ్ లు మధ్యవర్తులుగా మారి వాహనదారులను పీల్చి పిప్పి చేసి అధికారులకు వాటాలు పంచుతున్నారని న్యూస్ 10 ఆధారాలతో సహా బయట పెట్టడం అక్కడ ఓ ఎం వి ఐ స్థాయి అధికారికి ఏమాత్రం మింగుడు పడడం లేదు…కార్యాలయంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్లిన న్యూస్10 ప్రతినిధిపై ఆ అధికారి తన అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూసాడు…జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం తన అడ్డ జాగీరు అయినట్లు ఇక్కడకు ఎందుకు వచ్చారు…?అంటూ రుస రుస లాడాడు..తమ అవినీతి ,అక్రమ వసూళ్లపై ఎవరు రాయడం లేదు…మీరెందుకు రాస్తున్నారని ఓ పనికిమాలిన ప్రశ్న వేసి బెదిరించే ప్రయత్నం చేశాడు…మేము ఇలాగే అవినీతి పాల్పడుతూ అక్రమ వసూళ్లు చేపిస్తాం..వాహన దారులను ఇబ్బందులు పెడతాం అది మా ఇష్టం అన్నట్లు నోటికి ఏది వస్తె అది మాట్లాడి తాటాకు చప్పుళ్ళు చేసే ప్రయత్నం చేశాడు…కానీ ఆ తాటాకు చప్పుళ్ళ కు న్యూస్10 భయపడదు మానుకోట ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల దందా పై ప్రశ్నిస్తూనే ఉంటుంది అని స్పష్టం చేస్తున్నాం…

“సాయి”లీలలు అన్ని ఇన్ని కావు…

మానుకోట రవాణా శాఖ కార్యాలయం లో అన్ని తానే అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ ఎంవీఐ వాహన దారుల నుంచి ముక్కుపిండి వసూళ్లు చేసేందుకు తన డ్రైవర్ నే ప్రవేటు అసిస్టెంట్ గా పెట్టుకున్నట్లు తెలిసింది…ఇతగాడి ద్వారానే ఆ ఎంవీఐ రోజువారి వాటాలను అందుకుంటున్నట్లు తెలిసింది…ఇక్కడి కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల దందా పై న్యూస్ 10 తన కథనాలు వెలువరించిన తర్వాత ఇదే సదరు ఎంవీఐ కార్యాలయం చుట్టూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టీ వచ్చిపోయే వ్యక్తులను గమనించాలని కాపలాగా పెట్టినట్లు తెలిసింది…వీరు కార్యాలయం చుట్టూ ఉన్న కిరాణ డబ్బాల వద్ద ఉంటూ వచ్చిపోయే వారిని గమనిస్తూ అనుమానం వస్తె బెదిరించడానికి సైతం వెనకాడడం లేదు…అంతేకాదు సరిగ్గా ఇదే పనిని ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ లు సైతం చేస్తూ తమ సార్ పై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు…సమాచార సేకరణ కోసం వెళ్ళిన న్యూస్10 ప్రతినిధి ని సైతం బెదిరించి ఇదే హోం గార్డ్ లు ఆ అధికారి వద్దకు తీసుకు వెళ్లారు…కార్యాలయం లో మొత్తం వసూళ్ల దందాకు కర్త కర్మ క్రియ ఆ ఎంవీఐ అని సిరాచుక్క గుట్టు బయట పడడంతో ఆ విధానాన్ని మార్చి పెన్సిల్ గీత తో మార్క్ చేసి యదేచ్ఛగా వసూళ్లు ఈ సారే చేయిస్తున్నట్లు తెలుస్తుంది…ఇదిలాఉండగా ఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారుల అక్రమ లీలలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయి…సాయిలీలలతో అక్రమ వసూళ్లు నడుస్తుండగా ఈ వసూళ్ల సొమ్మును ఇక్కడి ఆర్టీఏ లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన “కృష్ణుడే” వాటాలు పంచుతున్నట్లు తెలిసింది…అంటే ఇతగాడే ఇక్కడ పంపకాల పెద్దమనిషి గా వ్యవహరిస్తున్నాడన్నమాట….

పెద్ద సారు వద్దకు ఏజెంట్లు…?


న్యూస్10 లో వస్తున్న కథనాలతో తమ అవినీతి దందాకు ,అధికారుల వాటాలకు చెక్ పడుతుందనే భయంతో మానుకోట ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉండే ఏజెంట్లు హుటాహుటిన మంగళవారం వరంగల్ ఆర్టిఏ కార్యాలయం కు వచ్చి పెద్ద సారు ను కలిసినట్లు తెలిసింది…మూడు వాహనాల్లో వరంగల్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఈ ఏజెంట్లు గంటలకొద్దీ ఈ అధికారితో చర్చలు జరిపినట్లు తెలిసింది…అదేదో సక్రమమైన పని అయినట్లు, అక్రమ వసూళ్లు చేయడం తమ హక్కు అయినట్లు రవాణా శాఖ తో అసలు ఏం సంబంధం లేని వ్యక్తులతో తన విధులు పక్కన పెట్టి రహస్యంగా చర్చలు జరపాల్సిన అవసరం ఆ అధికారికి ఎందుకో ..? ఆయనకే తెలియాలి…వరంగల్ ఆర్టిఏ కార్యాలయంలో అధికారిగా విధులు నిర్వహిస్తూ మానుకోట  ఇంచార్జ్ గా ఈ అధికారి కొనసాగుతున్నారు… ఏది ఏమైనా మానుకోట రవాణా శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న అక్రమ వసూళ్ల దందాపై ఎసిబి,టాస్క్ ఫోర్స్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.. ఇక్కడ బరితెగించి చేస్తున్న అక్రమ వసూళ్ల దందా వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహన దారులు అంటున్నారు…మరి ఈ విషయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…

వాళ్లు రౌడీ షీటర్లు జాగ్రత్త…?

ఏజెంట్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్న అధికారి…

న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here