మూతి పళ్లు రాలుతాయి

మూతి పళ్లు రాలుతాయి

ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కవిత ఫైర్

టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయి

తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించిన కల్వకుంట్ల కవిత

“ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ సాధించాం.. మళ్లీ మా జోలికొస్తే తగిన సమాధానం చెబుతాం”

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం చేతకాకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శ

తెలంగాణలో ఏపీ ఏజెంట్ సీఎం ఉండటంతోనే ఇలాంటి డ్రామాలు జరుగుతున్నాయని ఆరోపణ

“ముందు మీ సచివాలయంలోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. తర్వాత తెలంగాణలో సభలు పెట్టుకోండి” అంటూ పవన్‌కు కౌంటర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై . కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నవ నిర్మాణ సభల నిర్వహణపై స్పందించిన ఆమె, తెలంగాణ ఉద్యమ చరిత్రను, ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు.
టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయి. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికొస్తే మూతి పళ్లు రాలుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎవ్వరూ దెబ్బతీయలేరని, రాష్ట్ర ఆత్మగౌరవం విషయంలో ప్రజలు రాజీ పడరని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతోనే కొందరు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కవిత విమర్శించారు. తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యం పొందేందుకు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా, తెలంగాణలో ప్రస్తుతం ఏపీ ఏజెంట్ సీఎం ఉన్నందువల్లే ఇలాంటి రాజకీయ డ్రామాలు సాగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ, “ముందు మీ సెక్రటేరియట్‌లోకి నీళ్లు రాకుండా చూసుకోండి. తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభలు పెట్టుకోండి” అంటూ ఎద్దేవా చేశారు.

కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here