మేడారం హుండీ లెక్కింపు హన్మకొండ లోని టి టి డి కళ్యాణ మంటపం లో గురువారం ఉదయం ప్రారంభమైంది… దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హుండీ లెక్కింపు ను ప్రారంభించారు…ఈ లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు, స్వచ్చంద సంస్థ ల కార్యకర్తలు మొత్తం 150 మంది ఈ లెక్కింపులో పాల్గొంటున్నారు… వీరిలో దేవాదాయ శాఖకు చెందినవారు 70మంది, సేవ సమితికి చెందినవారు 80మంది ఉన్నారు… మొత్తం 820 హుండీలు ఉండగా ప్రస్తుతం 780హుండీలు టి టి డి కళ్యాణ మంటపం కు తీసుకురాగా ఇంకా 40 హుండీలు మేడారం నుంచి తీసుకు రావాల్సి ఉందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు…హుండీ లెక్కింపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది… ఈ లెక్కింపు సుమారు వారం రోజుల పాటు కొనసాగనుంది…





