తెలంగాణ రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు… జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు బి ఆర్ ఎస్, బీజేపీ లపై విమర్శలు చేశారు… ఇంకో మూడేళ్లు, ఆ తరువాత మరో అయిదేళ్లు ఉండే తమకే మున్సిపాలిటిల్లో అభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు…రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే నని రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు..నోట్ల రద్దు చేస్తే అసెంబ్లీ ఏర్పాటు చేసి మరీ అభినందించారని, మోడీ ప్రేమలో అమరత్వం పొందుతానని కేసీఆర్ చెప్పలేదా?..అని రేవంత్ ప్రశ్నించారు..ఫార్ములా ఈ కారు రేస్ ఈడీ దగ్దర ఉంది ఏం చేశారు?.. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే ఏం చేశారు?.. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా బీఆర్ఎస్, బీజేపీ అనుబంధం ఉందని సీఎం ఆరోపించారు..బీఆర్ఎస్, బీజేపీ మధ్య క్విడ్ అంటూ విమర్శలు చేశారు…



