టాస్క్ ఫోర్స్ అదుపులో హెప్సిబా నిర్వాహకులు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో హెప్సిబా పేరుతో మార్కెటింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులు వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది…పాలకుర్తి లో హెప్సిబా మార్కెటింగ్ పేరుతో ఓ సంస్థను రిజిస్టర్ చేసి ఆ సంస్థ పేరుతో మని చైన్ వ్యాపారాన్ని వీరు నడుపుతున్నట్లుగా సమాచారం…అయితే ఈ వ్యాపారం గత కొన్ని సంవత్సరాలు గా ఎలాంటి పిర్యాదులు లేకుండా నడుస్తుండగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం కావడంతో స్థానికంగా కలకలం రేగింది… సోమవారం రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు హెప్సిబా మార్కెటింగ్ సంస్థ నిర్వాహకుడు సైదులు,రామకృష్ణ, శ్రీధర్ లతో పాటు సైదులు భార్య,కూతురు ను కూడా అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది…విచారణ అనంతరం వీరిని టాస్క్ ఫోర్స్ అధికారులు మీడియా ముందు ప్రవేశ పెట్టె అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం… కాగా హెప్సిబా సంస్థ నిర్వాహకులపై పోలీసులు ఇప్పటికి ఎలాంటి ఎఫ్ ఐ ఆర్ చేయనట్లు తెలిసింది…అయితే వీరిని అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియడం లేదు…స్థానిక పోలీసులు సైతం హెప్సిబా మార్కెటింగ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది అని చెబుతున్నారు తప్ప ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పలేకపోతున్నారు….ఈ విషయమై పాలకుర్తి సిఐ జానకిరామ్ రెడ్డి ని  న్యూస్10 ప్రతినిధి వివరణ కోరగా హెప్సిబా మార్కెటింగ్ పై తమ పరిధిలో ఎలాంటి పిర్యాదులు రాలేదని…వారిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది వాస్తవమేనని ధృవీకరించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here