వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ వైపు డయాగ్నోస్టిక్స్ ఇష్టారాజ్యం,వైద్యులకు కమిషన్ పేరుతో అడ్డగోలు వైద్య పరీక్షల పీజులు వసూలు చేస్తున్న డయాగ్నోస్టిక్స్ అరకొర అనుమతులతో కొన్ని చోట్ల స్థానిక అధికారుల అండదండలతో కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తుండగా… వరంగల్,హన్మకొండ నగరాల్లో డయాగ్నోస్టిక్స్ నడుపుతూ ఆ సెంటర్ల లోనే స్కానింగ్,,ఇమేజింగ్ , సీటీ స్కానింగ్ సెంటర్లునడుపుతూ కొందరు అడ్డగోలు పీజులతో బాగానే దండుకున్నట్లు తెలుస్తుంది…అధిక పీజులతో రోగులను జేబులు ఖాళీ చేస్తున్న ఈ స్కానింగ్,ఇమేజింగ్ సెంటర్లు స్థానిక అనుమతులతో మాత్రమే నెట్టుకొస్తున్నట్లు తెలుస్తుంది…అధిక రేడియేషన్ ఉండే ఈ సెంటర్లు ఎలొర (ఎలక్ట్రానిక్ లైసెన్సింగ్ ఆప్ రేడియేషన్ అప్లికేషన్) అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి కాని అధికశాతం సెంటర్లు ఈ ఎలొర అనుమతులు లేకుండానే నిరాటంకంగా నడుపుతున్నారు.. ఎలక్ట్రానిక్ లైసెన్సింగ్ ఆఫ్ రేడియేషన్ అప్లికేషన్ ప్రతి డయాగ్నస్టిక్స్ సెంటర్, స్కాన్ సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ నుండి తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి …ఈ లైసెన్స్ లేకుండా ఏ స్కాన్, సి టి , ఎక్స్ రే, సియాన్ ఎక్స్ రే మిషన్స్ ఏవి ఉపయోగించుకోకూడదు. ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డయాగ్నస్టిక్స్, స్కాన్ సెంటర్లు ఎలోరా లైసెన్స్ లేకుండా సి టి స్కాన్ , ఎక్స్ రే మిషన్లను ఉపయోగిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో 5579 ఎలోరా లైసెన్స్ ఎక్విప్ మెంట్స్ ఉన్నాయి… వరంగల్ , హనుమకొండ జిల్లాలో మొత్తంగా 284 స్కానింగ్,సి టి స్కానింగ్, ఎక్స్ రే ఎక్విప్ మెంట్స్ డయాగ్నోస్టిక్స్, ఆసుపత్రుల్లో ఉండగా ఇవి ఎలొర లైసెన్స్ కలిగి ఉన్నాయి….కాని అధికశాతం సెంటర్లు ఎక్విప్ మెంట్స్ కలిగి ఉండి ఎలొర లైసెన్స్ లేకుండా కేవలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అనుమతితో నడిపిస్తున్నట్లు తెలియవచ్చింది…కొన్ని సెంటర్లు ఈ రెండు అనుమతులు లేకుండా వారికున్న పరపతి తో దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి….వరంగల్ హనుమకొంజిల్లాలోని డయాగ్నోస్టిక్స్ ,ఇమేజింగ్ సెంటర్లు ఏ లైసెన్సులు లేకుండా సిటి స్కాన్ కు 3,500 నుండి 5000 వరకు వసూలు చేస్తున్నారు.కనీసం డయాగ్నస్టిక్స్ సెంటర్లో రేడియాలజిస్టులు కూడా లేకుండా కేవలం టెక్నీషియన్ల ద్వారానే రిపోర్టులు అందిస్తున్నారు.కొన్ని డయాగ్నస్టిక్ ,ఇమేజింగ్ సెంటర్లు ఒక్క దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని రెండు మూడు చోట్ల సెంటర్లు నిర్వహిస్తున్నారు.స్కాన్ సెంటర్లో పేషెంట్ దగ్గరికి డయాగ్నస్టిక్స్ సెంటర్లు అంబులెన్స్ లు పంపించి రిఫర్ చేసిన డాక్టర్ అసిస్టెంట్స్ తో పేషెంట్ లను స్కానింగ్ కోసం పంపిస్తున్నారు….కాగ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ గైడ్లైన్స్ ప్రకారము ఎలోరా లైసెన్స్ పొందాలంటే రేడియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎక్విప్మెంట్ మ్యాప్ గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కంపెనీ సైతం అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు కు ఇన్స్టాలేషన్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
కానీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొన్ని కంపెనీలు ఇవేవీ పట్టించుకోకుండా ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేసి వదిలేస్తున్నారు.
ఇవిగో లైసెన్స్ లేని సెంటర్లు…
హన్మకొండ,వరంగల్ నగరాల్లో ఎలొర లైసెన్స్ లేని దందా…?
మరో సంచికలో….




