వసూళ్లలో ఆ తహశీల్దార్ దిట్ట…?

వసూళ్లు చేయడంలో అధికారి మహా దిట్ట అని పేరు బాగానే సంపాదించుకున్నాడు …వరంగల్ త్రినగరి లో రైల్వే జంక్షన్ ఉన్న మండలం లో పనిచేస్తున్న ఆ తహశీల్దార్ వసూళ్ల దందా గూర్చి తహశీల్దార్ లే చర్చించుకుంటున్నారు అంటే ఆ అధికారి వసూళ్ల దందా ఏ పాటిదో అర్థం చెసుకోవచ్చు…లిటిగేషన్ భూముల ఫైల్ వచ్చిందంటే ఎగిరి గంతేసి దాని వసూళ్ల బాధ్యత మొత్తం ఓ మీసేవ నిర్వాహకుడి కి అప్పగించే ఈ రెవెన్యూ అధికారి పనికి కావాల్సిన రేటు ఆ మీ సేవ నిర్వాహకుడి తోనే చెప్పించి డీల్ ఒకే కాగానే డన్ అని చెపితే పని చేసిపెడతాడని ఆరోపణలు వస్తున్నాయి… తాను పనిచేసే పక్క మండలం తహశీల్దార్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ఈ తాసిల్దార్ ఆ మండలం లో సైతం ఓ మీ సేవ నిర్వహకుణ్ణి స్టెపిని లాగా ఏర్పరచుకొని ఆ నిర్వాహకుని తో సైతం తరుచుగా వసూళ్లు చేయిస్తున్నట్లు తెలిసింది…నగర ప్రాంతం కొంత మేర ఈ అధికారి రెవెన్యూ పరిధిలోకి వస్తుండగా ఇక్కడ ఉన్న కొన్ని సర్కార్ భూములను కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు దండుకొని గజాల చొప్పున కట్టబెట్టినట్లు ఈ అధికారి పై ఆరోపణలు సైతం ఉన్నాయి..మూడో కంటికి తెలియకుండా మధ్యవర్తులను, మీ సేవ నిర్వాహకుల ద్వారా వసూళ్లు చేయిస్తున్న ఈ తహశీల్దార్ ను బదిలి చేద్దామన్న ఉన్నతాధికారులకు వీలు కావడం లేదట…నోరు తెరిస్తే సత్య ప్రవచనాలు వల్లించే ఈ అధికారి ఏసీబీ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్నట్లు తెలుస్తుండగా అక్రమ వసూళ్ల ద్వారా బాగానే వెనకేసి రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం… అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేరే జిల్లాలో బాధ్యతలు నిర్వహించిన ఈ తాశిల్దార్ ఎదో పైరవితో వరంగల్ త్రి నగరి లో పోస్టింగ్ తెచ్చుకొని వసూళ్ల పర్వానికి తెరతీసి వసూళ్లలో బాగు బా(వు)గు కిం(సిం)గ్ అనిపించుకుంటు కొందరు ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ బదిలీ కాకుండా నిక్షేపంగా కొలువు చేస్తున్నట్లు సమాచారం… అంతేకాదు ఇటీవల ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అదనపు కలెక్టర్ కు ఈ తహశీల్దార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది…ఆ సారు ఏ ఫైల్ చూడాలన్న, ఏ రెవెన్యూ అధికారితో మాట్లాడలన్న ఈ అధికారి మధ్యవర్తిగా వ్యవహరించి వసూళ్ల పనులు చక్కబెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి…ఆ అదనపు కలెక్టర్ ఎక్కువ గా ఫోన్ చేస్తూ టచ్ లో ఉన్నవారిలో ఈ అధికారి ఒకరని ఏసీబీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం… అప్పట్లో ఆ అదనపు కలెక్టర్ వద్ద ఏ ఫైల్ క్లియర్ కావలన్న ఇతగాడి చొరవ బాగానే ఉండేదని టాక్…

మీ సేవా నిర్వాహకుడు ఎక్కడ…?

ఆ మూడు మండలాల తాసిల్దార్ల తో అక్రమ వసూళ్ల దోస్తీ….?

మరో సంచికలో…

వసూళ్లలో ఆ తహశీల్దార్ దిట్ట...?- news10.app
వసూళ్లలో ఆ తహశీల్దార్ దిట్ట...?- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here