యూరియా బస్తాలతో ఇన్నోవా

శాయంపేట ప్రభుత్వ గోదాంలో ప్రైవేట్ వాహనం.
శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ గోదాం లో యూరియా బస్తాలతో పాటు ఉన్న ఇన్నోవా వాహనం పలు అనుమానాలకు తావిస్తోంది..
ప్రభుత్వ గోదాంలో ప్రైవేట్ వాహనం ఎక్కడిదని యూరియా బస్తాల కోసం వచ్చిన రైతులు చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది.శాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో గుర్తు తెలియని ఇన్నోవా వాహనం దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను అందజేస్తుంది. యూరియా బస్తాల కోసం వెళ్లిన రైతులకు కొత్త ఇన్నోవా వాహనం కనబడడంతో గోదాంలో ప్రైవేట్ వాహనం ఎక్కడినుండి వచ్చిందని బహిరంగంగా చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ గోదాంలోకి ప్రైవేటు వాహనం ఎలా వచ్చింది? అసలు ఈ వాహనం ఎవరిది.? అధికారులకి తెలిసి కూడా ఇన్నోవా వాహనాన్ని దాచిపెట్టారనే విమర్శలకు దారితీస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ వాహనం ప్రభుత్వ గోదాంలోకి ఎలా వచ్చింది.?మార్కెట్ కమిటీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది

యూరియా బస్తాలతో ఇన్నోవా- news10.app
యూరియా బస్తాలతో ఇన్నోవా- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here