ఓ సంచలన కేసులో జనగామ పోలీసులు 15మందిని అరెస్ట్ చేశారు…జనగామ, యాదాద్రి జిల్లాలో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లో రూ 3.72 కోట్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సిపి వెల్లడించారు. నిందితులనుంచి రూ.63.19 లక్షల నగదు ఒక కారు,రెండు ల్యాప్ టాప్లు, 5 డిస్క్ టాప్ కంప్యూటర్లు, 17 ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



