సివిల్ సప్లయీస్ లో వసూల్ రాజ…?

జిల్లా పౌర సరఫరాల శాఖలో ఆ అధికారి ఇష్టారాజ్యం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి…అందినకాడికి దండుకోవాలని బలంగా ఫిక్సయిన ఆ జిల్లా అధికారి జిల్లాలోని మిల్లర్లను వసూళ్ల వేటలో పిండి పిప్పి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం… తాను ఓ ప్రభుత్వ అధికారినన్న కనీస సోయి లేకుండా ఆ శాఖ ఉన్నతాధికారుల పట్ల ఏమాత్రం భయం లేకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి బరి తెగించి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం… హన్మకొండ జిల్లాలోని మిల్లర్ల కు కావాల్సిన ధాన్యం కేటాయించాలంటే ఈ అధికారిని ప్రసన్నం చేసుకుంటే సాధ్యం కాదన్న టాక్ ఇప్పుడు జిల్లాలోని మిల్లర్స్ లో బలంగా వినిపిస్తుంది…అంతేకాదు ఈ అధికారి ఒక్కో మిల్లర్ నుంచి ఒక్కో “ల”కారం పైగానే వసూలు చేస్తున్న ట్లు తెలిసింది…ఇటీవల ఈ అధికారి ఏకంగా తన చాంబర్ కే కొందరు మిల్లర్లను పిలిపించి తనకు ఆమ్యామ్యా సమర్పించాలని హుకుం జారీ చేసినట్లు తెలియవచ్చింది…తనకు ఆగస్టు నెలలో పదవీవిరమణ ఉన్నందున ఆ లోపే భారీగా వెనకేయాలని ఈ జిల్లా అధికారి కంకణం కట్టుకొని మరీ అవినీతి దందాలో దూసుకుపోతున్నట్లు సివిల్ సప్ల యీస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి…

ఎవడైతే నాకేంటి…? కావాల్సింది ఇస్తేనే సరి .. అని వసూల్ రాజా గా అవతారం ఎత్తిన ఆ పౌరసరఫరాల జిల్లా అధికారి వసూళ్ల పర్వం పై న్యూస్10 విశ్వసనీయ వరుస కథనాలు త్వరలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here