కళ్ళుమూసుకున్న అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల మధ్య ఉన్న గ్యాస్ గోడౌన్ల విషయంలో అధికారులు కళ్ళు మూసుకున్నట్లు కనబడుతోంది ..నివాస ప్రాంతాలు ,రైల్వే ట్రాక్ ల పక్కన ఉన్న గ్యాస్ గోడౌన్ లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుక ముందు ఆడుతూ మీనమేషాలు లెక్కిస్తున్నారు ..వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా హనుమకొండ ,వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో కొన్ని గ్యాస్ గోడౌన్లు నివాస ప్రాంతాల మధ్య, రైల్వే ట్రాక్ ల పక్కన ఉన్నాయని తెలిసిన అధికారులు మాత్రం అన్ని తెలిసి గప్ చుప్ గా ఉంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.. ఈ గ్యాస్ గోడౌన్లపై చర్యలు తీసుకునే అధికారం పౌర సరఫరాల శాఖ అధికారులకు ఉన్న వారికేం పట్టనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది ..కాగా ఈ గ్యాస్ గోడౌన్ల విషయంలో తమకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేస్తున్న మునిసిపల్ ,ఫైర్ సేఫ్టీ ,పోలీస్ అధికారులు మాత్రం గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది… గ్యాస్ గోడౌన్ లపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూనే వీరు మాత్రం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో వారికే తెలియాలి… ఓవైపు గ్యాస్ గోడౌన్లు ఏర్పాటు చేయడానికి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అనుమతులు ఎలా ఇచ్చారో అర్థం కాని విషయం.. జనావాసాల మధ్య గ్యాస్ గోడౌన్లు నిర్వహిస్తున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడం సివిల్ సప్లై అధికారులకే చెల్లిందని పలువురు ఆరోపిస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here