ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు…బి ఆర్ ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన ఆయన ఆపరేషన్ కగార్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు… బలం ఉంది కదా అని చంపుకుంటు పోవడం ధర్మం కాదన్నారు…ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ గడ్ లో ఊచ కోత కొస్తుందన్నారు…మావోయిస్టులు ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని చెబుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం వారితో శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ కేంద్రానికి సూచించారు…కాగా ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని కేంద్రానికి బి ఆర్ ఎస్ ఓ లేఖ రాస్తుందని కేసీఆర్ ఈ సందర్బంగా వెల్లడించారు…



