ఎవడైతే నాకేంటి…?

పౌర సరఫరాల శాఖలో వసూల్ రాజాగా అవతారం ఎత్తినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పౌర సరఫరాల అధికారి ఎవడైతే నాకేంటి…?అన్నట్లు వసూళ్ళలో బరితెగింపు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది…మిల్లులకు ధాన్యం కేటాయించడానికి ఎలాంటి మొహమాటం లేకుండా మిల్లర్ల వద్ద మామూళ్లు వసూల్ చేసే ఈ అధికారి ప్రశ్నిస్తే చాలు చిర్రుబుర్రు లాడడం ఉన్నతాధికారుల ను సైతం లెక్కచేయని తనంతో వ్యవహరిస్తాడని విమర్శలు వినిపిస్తున్నాయి… ఇదే తరహాలో ధాన్యం కొనుగోలు విషయంలో వివరణ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిధిపై సైతం ఆ అధికారి చిట పట లాడాడు… పౌరసరఫరాల శాఖ మొత్తం తన సొంతమైనట్లు తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడిన అవి సక్రమమే ఐయినట్లూ తనకు తానే మంచి అనిపించుకునే ప్రయత్నం చేసాడు.. హన్మకొండ జిల్లా పరిధిలో ఇటీవల ఓ మిల్లు లో ధాన్యం విషయంలో టాస్క్ ఫోర్స్ విచారణ జరపగా అసలు ఆ విచారణ గూర్చి తనకేమి తెలియదని సమాధానం ఇచ్చి సదరు అధికారి చేతులు దులుపుకున్నాడు… అసలు టాస్క్ ఫోర్స్ వచ్చిందే తనకు తెలియదన్నాడు… ఇదే విషయమై సివిల్ సప్లైఈస్ డిప్యూటీ తహశీల్దార్ ను న్యూస్10 వివరణ కోరగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసింది నిజమేనని చెప్పారు…జిల్లా అధికారి అలా ఎందుకు చెప్పాడో తనకు తెలియదని బహుశా సార్ మర్చి పోవచ్చని ఆ డి టి తన బాస్ ను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసాడు… ఈ తాజా ఘటనతో పౌరసరఫరాల జిల్లా అధికారి బుకాయించడం లో నంబర్ వన్ అని తేలింది….

తాజ డీల్….?

హన్మకొండ జిల్లాలో ఉన్న కొన్ని మిల్లులకు వేరే జిల్లాల నుంచి ధాన్యం కేటాయించడానికి రంగం సిద్ధం కాగ వీటిలో ఓ పన్నెండు మంది మిల్లర్ల వద్ద నుంచి సదరు అధికారి అక్షరాల పన్నెండు “ల”కారాలు పుచ్చుకునట్లు విశ్వసనీయంగా తెలిసింది… కేవలం ఈ డీల్ కుదుర్చుకోవడం కోసమే జిల్లా పౌర సరఫరాల అధికారి ఏకంగా తన చాంబర్ లొనే ఆ 12 మంది మిల్లర్స్ తో భేటీ ఐయినట్లు తెలిసింది…మిల్లర్స్ మంగళవారం భేటీ ఐయి వెళ్లారో లేదో బుధవారం ఉదయం కల్ల వారికి వేరే జిల్లాల నుంచి ధాన్యం కేటాయిస్తూ ఓ జాబితా విడుదల చేసినట్లు తెలిసింది…తప్పుల తడకగా ఉన్న ఈ జాబితా సీరియల్ నంబర్స్ జంపింగ్ కాగ….ధాన్యం కేటాయించిన ఈ జాబిత లొనే కోట్ల రూపాయల ధాన్యం పెండింగ్ లో ఉండి సర్కార్ కు బాకీ పడ్డ ఓ మిల్లర్ సైతం ఉన్నట్లు ఈ మిల్లర్ కు రెండు మిల్లులు ఉన్నట్లు తెలిసింది…ఈ మిల్లర్ పెద్ద సారు కు అత్యంత సన్నిహితుడని సమాచారం.. ఈ రెండు మిల్లులే కాకుండా శాయంపేట మండలం లోని ఓ మిల్లుకు సైతం జిల్లా పౌర సరఫరాల అధికారి ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలిసింది…

కాగితాల పై ధాన్యం సరఫరా…?
ఆ అధికారి చేతివాటం…

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here