కాగితాలపైనే ధాన్యం సరఫరా…?

ఆ జిల్లా పౌర సరఫరాల అధికారి అందినకాడికి దండుకోవడం లో సిద్ధహస్తుడని విమర్శలు బాగానే వినవస్తున్నాయి…తన చేతివాటం చూపించి మిల్లర్ల వద్దనుంచి తోచినంత వసూలు చేసి తనను ఏదొరకంగా ప్రసన్నం చేసుకున్న వారికే ధాన్యం కేటాయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ధాన్యం కేటాయింపులో కొన్ని మిల్లుల పట్ల తన పక్షపాతాన్ని చూపించే జిల్లా పౌర సరఫరాల అధికారి ఇటీవల ధాన్యం కేటాయింపులో తన చేతివాటాన్ని బాగానే చూపినట్లు తెలిసింది…

కాగితాలపై ధాన్యం కేటాయింపు…

ఖరీఫ్ 2024-2025 సీజన్ లో హన్మకొండ జిల్లాలోని ఓ రెండు మిల్లులకు ధాన్యం షిఫ్టింగ్ చేసినట్టు సదరు జిల్లా అధికారి రిపోర్ట్ ఇచ్చారు… జిల్లాలోని ఓ మిల్లులో అధిక ధాన్యం ఉండడంతో అక్కడి ధాన్యాన్ని ఆ మిల్లర్ వద్ద నుంచి వేరే రెండు మిల్లులకు తరలించడంలో ఆ అధికారి తన చతురతను బాగానే వాడినట్లు తెలిసింది… ఆ మిల్లులోని ధాన్యాన్ని అక్కడనుంచి ఫిజికల్ గా తరలించకుండా కేవలం పేపర్ పై మాత్రమే తరలించారట…పేపర్ తరలించడం అంటే తాము ధాన్యం తరలించినట్లు పేపర్ పై నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వడం అన్నమాట…నిజానికి ఆ ధాన్యాన్ని ఆ మిల్లర్ కే కట్టబెట్టి రెండు మిల్లులకు తరలించినట్లు రిపోర్ట్ వండి వార్చరన్నమాట…కాగా ఆ మిల్లు ధాన్యం విషయంలో ట్రక్ షీట్,వే బ్రిడ్జ్ బిల్లు లేదన్నది స్ఫష్టం ఆ రెండు రశీదులు లేవంటే ధాన్యం తరలింపు పచ్చి అబద్ధం ఆ ధాన్యం జిల్లా పౌర సరఫరాల అధికారి సాయంతో మాయం అయినట్లు అర్థం అవుతుంది…ఇది ఇలావుంటే ఈ ధాన్యం తరలింపు విషయంలో జిల్లా అధికారిని న్యూస్ 10 వివరణ అడిగితే పూర్తి పొంతన లేని సమాధానం చెబుతున్నారు…ట్రక్ షీట్,వే బ్రిడ్జ్ రశీదులు ఉన్నాయా అని ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారు…దీన్నిబట్టి చూస్తే ఇక్కడ అవినీతి బాగానే జరిగినట్లు మిల్లర్స్ చర్చించుకుంటున్నారు….

సార్ కు ఆ మిల్లర్ అండ…?

జిల్లా పౌర సరఫరాల అధికారి ఏది చేయాలన్న హన్మకొండ జిల్లాలోని ఓ మిల్లర్ పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తుంది….ఆ అధికారికి ఇతగాడు బినామీ అన్నట్లు ప్రచారం సాగుతోంది…ధాన్యం కేటాయించాలన్న,సారును ప్రసన్నం చేసుకోవాలన్న ఆ మిల్లర్ ను కలిస్తే చాలు అంత చక్కబెడుతాడని సమాచారం….ఈ మిల్లర్ తో పాటు మరో ఇద్దరు మిల్లర్స్ కూడ సార్ సేవలో బాగానే తరిస్తున్నట్లు తెలిసింది…ఇందుకు ప్రతిఫలంగా ఎప్పుడు మిల్లులకు ధాన్యం కేటాయించిన వీరికి మొదటి ప్రాధాన్యత దక్కుతుందట… ఇందులో భాగంగానే ఓ రెండు మిల్లులకు యజమాని ఐయిన్ ఆ మిల్లర్ కోట్ల రూపాయల ధాన్యం సర్కార్ కు బాకీ ఉన్న బుధవారం వేరే జిల్లా నుంచి భారీ ఎత్తున అతగాడి మిల్లుకు ధాన్యం కేటాయించారు సదరు అధికారి….

కోట్లు బాకీ పడ్డ మిల్లర్…?

ఐయిన మళ్ళీ ధాన్యం కేటాయింపు

ఎవరా మిల్లర్…ఏమా అవినీతి కథ…?
మరో సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here