అప్పయ్య సార్ “తప్పే”నా

హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఇటీవల చేపట్టిన నియామకాల విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి…ఈ ఉద్యోగాల నియామకంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఏప్రిల్ 16 న హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆద్వర్యంలో జరిగిన యం ఎల్ ఎచ్ పి పోస్టుల భర్తీ లో భారీ స్థాయి లో అవకతవకలు విమర్శలు వస్తున్నాయి…
ఇటీవల హన్మకొండ జిల్లాలో 13 యం ఎల్ ఎచ్ పి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియ హన్మకొండ జిల్లా కలెక్టరు పర్యవేక్షణలో జరిగిన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకు అవకాశముండదని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భావించారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు… ఎంపిక ప్రక్రియలో కలెక్టర్ మెరిట్ లిస్ట్ మాత్రమే చూస్తారు, కానీ మెరిట్ లిస్ట్ లో ఉన్న వారి మార్కులు నిజమైనవో కావో చూడరు కనుక ఇదే అదనుగా భావించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్కువ మార్కులు వచ్చిన వారిని మెరిట్ జాబితాలో చేర్చారు. తక్కువ మార్కులతో అర్హత లేని వారికి ఉద్యోగం కట్టబెట్టేందుకు కొందరి వద్ద బేరం కుదుర్చుకొని మార్కులు పెంచి మెరిట్ లిస్ట్ తయారు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి…. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చేందుకు కొంతమంది నుంచి.. లక్షల్లో డబ్బులు దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.కాగా మెరిట్ లిస్ట్ లో ముందంజ లో ఉన్న కొంత మంది వ్యక్తుల అకడమిక్స్ మార్క్స్ ఇంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్ల లో మెరిట్ లిస్టుతో పోల్చిచూస్తే మార్కులు అమాంతంగా పెరిగి పోయాయి… ఓ అభ్యర్థికి యం బి బి యస్ లో 1410 మార్కులు రాగా ఈ ఉద్యోగం ఇచ్చేందుకు మెరిట్ లిస్ట్ లో ముందుగా చూపేందుకు గాను అతడి మార్కులను ఏకంగా 1642 కు పెంచి మెరిట్ లిస్ట్ విడుదల చేయడం అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది….చేసుకున్న ఒప్పందం ప్రకారం సదరు యం బి బి యస్ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వడం కోసం మార్కులు పెంచినట్లు అర్థం అవుతుంది… ఇలా మార్కులు పెంచి కలెక్టర్ కు మెరిట్ లిస్ట్ పంపడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హస్తం లేకుండా ఎలా సాద్యం అవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు…అప్పయ్య సార్ “తప్పే” కదా అంటున్నారు…

వైద్య ఆరోగ్య శాఖ లో వారిదే పెత్తనం…?

ఆ సార్ చెప్పింది జరగాల్సిందే….

ఉద్యోగ నియామకాల్లో అసలేం జరిగింది….?
మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here