భారీ స్థాయిలో బకాయి ఉన్న మిల్లర్ కు ధాన్యం కేటాయించడం లో హన్మకొండ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎక్కడ లేని అత్యుత్సహం చూపుతున్నట్లు కనపడుతుంది…రబీ కి చెందిన 2022-24 ఖరీఫ్ కు చెందిన 2024-25 ఇతడికి చెందిన మరో మిల్లు రబి 2023-24,ఖరీఫ్ 2024-25 కు చెందిన బకాయి మొత్తం రెండింటికి కలిపి ఆ మిల్లర్ 28 కోట్లకు పైగా సర్కార్ కు బకాయి ఉన్న దానిని ఏమాత్రం పట్టించుకోకుండా సదరు అధికారి మళ్ళీ ధాన్యం కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది..ఇన్ని కోట్ల రూపాయల ధాన్యం బాకీ ఉన్న మిల్లర్ పై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తారు..డిఫాల్టర్ గా బ్లాక్ లిస్ట్ లో ఉంచి ధాన్యం కేటాయించకుండా ఆపేస్తారు కానీ ఆ డి యస్ ఓ అలా చేయలేదు తనకు అత్యంత దగ్గరి వ్యక్తి కనుక తన వ్యవహారాలు అన్ని చక్కబెట్టే వాడు కనుక ఎప్పుడు ధాన్యం కేటాయించిన మొదటి ప్రాధాన్యతను ఇస్తూ తన పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… ఈ మిల్లర్ కు రెండు మిల్లులు ఉండగా ఈ రెండు మిల్లులు సైతం సర్కార్ కు ధాన్యం బకాయి ఉన్నట్లు సమాచారం…ఈ రెండు మిల్లుల పేరుతో మిల్లర్స్ అసోసియేషన్ లో చక్రం తిప్పుతున్న ఆ మిల్లర్ జిల్లా పౌర సరఫరాల అధికారికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఒక దశలో బినామిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…కాగ మిల్లులు తన సతీమణి పేరు మీద ఉన్న ఆ మిల్లర్ మాత్రం అసోసియేషన్ లో ఓ పోస్ట్ తో పెత్తనం చేలాయిస్తున్నట్లు తెలియవచ్చింది…అందుకే ఇతగాడకి సదరు అధికారి సహకరిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మిల్లర్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి… లెక్క తీస్తే కళ్ళు బైర్లు కమ్మేలా సర్కార్ కు బకాయి పడ్డ ఆ మిల్లర్ కు డి యస్ ఓ సహకరిస్తున్న ఉన్నతాధికారులు సైతం అదేం పట్టనట్లు ఉండడం ఏంటో అర్థం కావడం లేదు…ధాన్యం బకాయి ఉన్న జాబితా,ఎవరు ఎన్ని కోట్లల్లో బకాయి ఉన్నారో అదనపు కలెక్టర్ స్థాయి అధికారి దృష్టిలో ఉన్న చూసిచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది…
అంతా ఆ అధికారికే తెలుసు…!!
ఒక మిల్లర్ రెండు మిల్లులు…
28 కోట్ల 68 లక్షల 82 వేల రూపాయల బకాయి
ఎవరా మిల్లర్ …?
మరో సంచికలో….



