ఈ రెండు మిల్లులు కనపడలేదా….?

వడ్డించేవాడు మనవాడైతే… ఎన్ని బకాయిలు ఉన్న సర్కార్ కు ఎంత బాకీ ఉన్న ఓకే…వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనేది సామెత. అవును మరి వడ్డించేవారిని ప్రసన్నం చేసుకున్న ఆ మిల్లర్ కు సర్కార్ కు ఎంత ధాన్యం బాకీ ఉన్న మళ్లీ మళ్లీ ధాన్యం కేటాయింపు ఏమాత్రం ఆగకుండా వరదల వచ్చేస్తుంది…హన్మకొండ పౌర సరఫరాల జిల్లా అధికారికి అతి సన్నిహితంగా ఉంటాడని ఆరోపణలు వస్తున్న ఆ మిల్లర్ కు ధాన్యం కేటాయించడానికి సదరు జిల్లా అధికారి ఎలాంటి మొహమాటం లేకుండా సర్కార్ నిబంధనలను పాతరేసి కోట్ల రూపాయలు బాకీ ఉన్న ఆ మిల్లర్ కు చెందిన రెండు మిల్లులకు తాజాగా ధాన్యం కేటాయించి నేను తలుచుకుంటే ఏ ఉన్నతాధికారి ఎలాంటి నిబంధనలు అసలు అడ్డే రావు అని నిరూపించుకున్నట్లు కనపడుతుంది… సార్ బాటలోనే ఆయన గారి అభిమాన మిల్లర్ సైతం తనను అనేవారు అడిగే వారు ఎవరు లేరు తనకు అన్ని తెలుసు అందరు తెలుసు తాను అసోసియేషన్ మనిషిని అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరిని లెక్కచేయని తనంతో బకాయి ఉంటే ఏంటి…దమ్ముంటే కేసు పెట్టండి మిల్లులు సీజ్ చేయనియండి అంటూ పౌర సరఫరాల శాఖకు, ఉన్నతాధికారులకు సవాల్ విసురుతున్నట్లు తెలియవచ్చింది… ఇలా సర్కార్ కు 2022 నుంచి కోట్లల్లో బకాయి ఉన్న ఈ మిల్లర్ కు జిల్లా పౌర సరఫరాల అధికారి తన శాయశక్తులా సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…

ఇదీ బకాయిల చిట్టా…

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కనిపర్తి గ్రామంలో శ్రీశైలం మల్లన్న ఇండస్ట్రీస్,ఇదే మండలం లోని మరిపెల్లి గూడెం లో వీరభద్ర ఇండస్ట్రీస్ ను ఆ మిల్లర్ తన సతీమణి పేర నిర్వహిస్తున్నాడు…సతీమణి పేర మిల్లులు నిర్వహిస్తూనే అసోసియేషన్ లో తాను కీలకమని చెప్పుకొనే ఈ మిల్లర్ సర్కార్ కు అక్షరాల 28 కోట్ల 68 లక్షల 82 వేల రూపాయల ధాన్యం బకాయి ఉన్నాడు…ఇందులో శ్రీశైలం మల్లన్న ఇండస్ట్రీస్ ,కనిపర్తి 2022-2023 రబీలో 3 కోట్ల 78 లక్షల 82 వేలు,2023-24రబి లో 60 లక్షలు ,ఖరీఫ్ 2024-25 లో 12 కోట్లు మొత్తం 16 కోట్ల 68 లక్షల 82 వేల రూపాయల ధాన్యం బకాయి ఉంది… ఇక వీరభద్ర ఇండస్ట్రీస్ ,మరిపెల్లి గూడెం రబి 2023-24 లో 20 లక్షలు, ఖరీఫ్ 2024 -25 లో 11 కోట్ల 80 లక్షల ధాన్యం బకాయి ఉండగా ఆ మిల్లర్ కు చెందిన రెండు మిల్లులు మొత్తంగా 28 కోట్ల 68 లక్షల 82 వేలు సర్కార్ కు బకాయి పడ్డాయి…ఇదిలాఉంటే ఈ కోట్ల రూపాయల బకాయి ఉన్న జిల్లా పౌరసరఫరాల అధికారి ఆ రెండు మిల్లులకు రబి 2024-25 కు చెందిన ధాన్యాన్ని ములుగు, ఖమ్మం జిల్లా నుంచి కేటాయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు… ఇటీవలే కేటాయించిన ఈ ధాన్యం జాబితాలో సీరియల్ నంబర్ 27 లో వీరభద్ర ఇండస్ట్రీస్ కు ములుగు జిల్లా నుంచి 15 వేల క్వింటాలు, ఖమ్మం జిల్లా నుంచి 30 వేల క్వింటాలు మొత్తం 45 వేల క్వింటాలు ధాన్యం కేటాయించారు… ఇక జాబితాలో సీరియల్ నంబర్ 29 శ్రీశైలం మల్లన్న ఇండస్ట్రీస్ కు ములుగు జిల్లా నుంచి 10 వేల క్వింటాలు, ఖమ్మం నుంచి 15 వేల క్వింటాలు మొత్తం 35 వేల క్వింటాలు కేటాయించారు…కాగా ఈ ధాన్యం కేటాయించిన జాబితా మొత్తం తప్పుల తడకగా సీరియల్ నంబర్ జంపింగ్ తో గందరగోళం గా ఉంది…ఈ జాబితాలో బకాయి పడ్డ ఈ మిల్లర్ ఒక మిల్లు ఉన్న ఊరు పేరు పేర్కొనగ మరో మిల్లు ఏ గ్రామం లో ఉందొ చెప్పలేదు అంటే జిల్లా పౌర సరఫరాల అధికారి తాను అనుకున్న వారివద్ద నుంచి అనుకున్నది పుచ్చుకొని ఆఘమేఘాల మీద జాబితా రూపొందించి ధాన్యం కేటాయించారని విమర్శలు వస్తున్నాయి…. కోట్లల్లో భారీగా బకాయి ఉన్న ఈ మిల్లుకు పదే పదే ఎందుకు సదరు అధికారి ధాన్యం కేటాయిస్తున్నారో సారుకే తెలియాలి….కొద్దీ బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా కోట్లల్లో బకాయి ఉన్న ఆ మిల్లర్ కే ఎందుకు ధాన్యం కేటాయిస్తున్నారో జిల్లా పౌర సరఫరాల అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…

అసోసియేషన్ నుంచి అధికారి వరకు…

ఆ మిల్లర్ దందా పెద్దదే….?

న్యూస్10 పూర్తి విశ్వసనీయ కథనం మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here