బకాయిల సంగతి అంతేనా….?

హన్మకొండ జిల్లా పౌర సరఫరాల అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ధాన్యం కేటాయింపులో ఒంటెద్దు పోకడతో తనకు అనుకూలంగా ఉన్న వారికి,తనను తన చాంబర్ లో ప్రసన్నం చేసుకున్న వారికి అడ్డగోలుగా ధాన్యం కేటాయిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి…ఇదే తరహాలో డి యస్ ఓ కమలపూర్ మండలంలోని కనిపర్తి,మరిపెల్లి గూడెం లోని రెండు మిల్లులు సర్కారుకు 28 కోట్ల రూపాయలకు పైగా బాకీ ఉన్న ధాన్యం కేటాయించారు… ఇంత పెద్ద మొత్తంలో బకాయి ఉంటే కేసు పెట్టి మిల్లర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సింది పోయి ఈ మిల్లర్ కు డి ఎస్ ఓ ఎక్కడలేని భరోసా ఇస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….

ఉలుకు పలుకు లేని డి యస్ ఓ..

పెద్ద మొత్తంలో బకాయి ఉన్న ఆ రెండు మిల్లుల తో పాటు తనను ప్రసన్నం చేసుకొని కావాల్సింది అప్పగించిన మిల్లర్లకు ధాన్యం కేటాయించిన హన్మకొండ జిల్లా పౌర సరఫరాల అధికారి ఉలుకు పలుకు లేకుండ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది…గత కొద్దిరోజులుగా సివిల్ సప్లయీస్ లో జరుగుతున్న అక్రమాలు,అధికారి చేతివాటం పై వరుస కథనాలు వెలువరిస్తుండగా వీటిపై ఆ అధికారి వివరణ కోసం వెలితే ఎప్పుడు అందుబాటులో ఉండడం లేదు…ఒకవేళ ఆ అధికారి తన చాంబర్ లో ఉన్న న్యూస్10 ప్రతినిధిని చూడగానే ఎదో పని ఉందని మొహం చాటేస్తున్నాడు…మిల్లర్ల తో అనధికారికంగా తన చాంబర్ లో మీటింగ్ పెట్టి వసూళ్ల హుకుం జారీ చేసే డి యస్ ఓ వివరణ ఇవ్వకుండా ఎందుకు మొహం చాటేస్తున్నారో ఆయనకే తెలియాలి… అంతేకాదు 28 కోట్లకు పైగా సర్కార్ కు ఆ మిల్లర్ బకాయి ఉన్న చర్యలు తీసుకోవడానికి డి యస్ ఓ ఎందుకు వెనుకాడుతున్నారో దీని వెనకాల ఉన్న మతలబు ఏంటో అర్థం కావడం లేదు…

సెలవులో అదనపు కలెక్టర్…


జిల్లా పౌర సరఫరాల శాఖలో కీలకంగా వ్యవహరించాల్సిన హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నెల రోజులకు పైగా సెలవు పెట్టి వెళ్లడం తో ఈ శాఖ లో జరుగుతున్న అవినీతి, జిల్లా అధికారి అవినీతి లీలలపై ఎవరు విచారణ జరువుతారో తెలియ కుండ ఉంది…కోట్ల రూపాయల బకాయి ఉన్న మిల్లర్స్ కు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ధాన్యం కేటాయిస్తున్న డి ఎస్ ఓ పై ఎవరు చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి…

బ్లాక్ లిస్ట్ కు ఎంట్రీ…?

అసోసియేషన్ నాయకుడి తో డి ఎస్ ఓ మంతనాలు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here