అప్పయ్య సార్ అనుకున్నది చేసార…?

హన్మకొండ జిల్లా లో వైద్యుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రూడి అవుతుంది…వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేసి అనర్హులకు ఉద్యోగాలిచ్చారనే ఆరోపణలు నిజంగానే కనిపిస్తున్నాయి… యం బి బి యస్ లో మార్కులు తక్కువగా ఉంటే ఉద్యోగానికి ఎంపిక కాడని తెలిసి అధికారులే ఆ అభ్యర్థి మార్కులను పెంచి సెలెక్షన్ లిస్ట్ తయారు చేసారని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అబ్యర్థులు ఆరోపిస్తుండగా ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం న్యూస్10 చేతికి చిక్కాయి…కాగా ఇప్పటికే ఈ ఉద్యోగాల నియామకం లో అవకతవకలు జరిగాయని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థి హన్మకొండ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసాడు… దొడ్డిదారిన ఉద్యోగం ఇవ్వడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కావాలనే మార్కులు పెంచి ఉద్యోగం కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి….

అప్పయ్య సార్ అనుకున్నది చేశార…?

హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అనుకున్నది అనుకున్నట్లు గానే చేశారనే ఈ నియామకాలను బట్టి అర్థం అవుతుంది…ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆ అభ్యర్థి ఆకడమిక్ మార్కులు అమాంతంగా పెరగడానికి కారణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య కారణమని అబ్యర్థులు ఆరోపిస్తున్నారు…జిల్లా అధికారి హస్తం లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు అవుతున్న ప్రక్రియలో అవకతవకలు ఎలా జరుగుతాయని ప్రశ్నలు వస్తున్నాయి…ఈ నియామకాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయని డబ్బులు చేతులు మారకుండా అనర్హులకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి దీని వెనకాల ఉన్న మతలబు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు..

బి ఏ యం ఎస్ లకు ఎలా…?

వైద్య ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల కోసం మెరిట్ లిస్ట్ లో ముందంజ లో ఉన్న కొంత మంది
13 యం ఎల్ ఎచ్ పి పోస్టులకు 38 మంది యం బి బి యస్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 116 మంది బి ఏ యం యస్ విద్యార్థులు, వీరితోపాటు బిఎస్సి నర్సింగ్ విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం యం బి బి యస్ డాక్టర్లు అందుబాటులో ఉన్నప్పుడు బి ఏ యం యస్ చదివిన వారికి ఈ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈ నియామకాల్లో ఓ బి ఏ యం యస్ డాక్టర్ నీ సైతం ఇదే నోటిఫికేషన్ లో భర్తీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఎంపిక చేసిన జాబితాలో చేర్చబడిన బి ఏ యం యస్ డాక్టర్ మెరిట్ లిస్టులో 10 వ స్థానంలో ఉన్నారు. తనకంటే ముందు ఉన్న 9 మంది యం బి బి యస్ డాక్టర్లను ను వదిలి తనను ఎలా ఎంపిక చేశారో వైద్యశాఖ అధికారులకే తెలియాలి…ఎందుకంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం బి ఏ యం యస్ డాక్టర్ కి ఈ పోస్ట్ వచ్చే అవకాశం లేదని వైద్య శాఖలొనే చర్చ జరుగుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here