తాను పదవి విరమణకు దగ్గర గా ఉన్న అనుకున్నది చేయాలి అందిన కాడికి ఎదో చేయాలని అనుకుంటున్నాడు కావచ్చు అందుకే ఆ జిల్లా అధికారి తీరు లో ఏమాత్రం మార్పు రావడం లేదు…తన అధికారాన్ని అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్న ఆ అధికారి తన శాయశక్తులా వసూళ్లే లక్ష్యం గా ముందుకు వెళుతున్నాడు… బకాయి ఉన్న మిల్లర్లు,బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్లు, క్రిమినల్ కేసులు నమోదు అయిన మిల్లర్లు అని తేడా లేకుండా కావల్సింది సర్దితే ధాన్యం కేటాయింపు చేసి సర్కార్ ఖజానాకు గండి పడ్డ ఫర్వాలేదు అన్నట్లు గా ఆ అధికారి వ్యవహారశైలి కనపడుతోంది… ఆరోపణలు ఎన్ని వచ్చిన తనను కాదు తనకేం కాదు ఉన్నతాధికారుల అండదండలు ఓ మంత్రి తో సంబంధం ఉన్న లీజు కిచ్చిన మిల్లు కలిగి ఉన్న ఓ మిల్లర్ సపోర్ట్ బాగా ఉందని తాను ఏంచేసి న చెల్లుతుందనే ధోరణిలో జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ఉన్నట్లు సమాచారం…
బ్లాక్ లిస్ట్ కు ఎంట్రీ…?
వారు సర్కారుకు బకాయి పడ్డ మిల్లర్లు , బ్లాక్ లిస్ట్ లో ఉన్నవారు..అందులో కొందరు బకాయి ఉందని క్రిమినల్ కేసులు సైతం నమోదు ఐయిన వారు కూడా ఉన్నారు.. సర్కార్ నిబంధనల ప్రకారం అలాంటి వారికి ధాన్యం కేటాయించకూడదు కాని తనను ప్రసన్నం చేసుకుంటే ఏదైనా సాధ్యం కనుక బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్లు హన్మకొండ కలెక్టరేట్ లోని డి ఎస్ ఓ కార్యాలయానికి వచ్చారు…ఎలాంటి అడ్డు లేకుండా ఏకంగా జిల్లా పౌర సరఫరాల అధికారి చాంబర్ లొనే మంత్రాగం జరిపారు…బ్లాక్ లిస్ట్ లో క్రిమినల్ కేసులు ఉన్న మిల్లర్స్ అసలు డి యస్ ఓ ను ఎందుకు కలవాల్సి వచ్చింది…? వారికి సదరు డి యస్ ఓ ఎం అభయం ఇచ్చారు… తనను ప్రసన్నం చేసుకుంటే అడిగింది సమర్పిస్తే ధాన్యం కేటాయిస్తా అని అభయం ఇచ్చినట్లు సమాచారం…ఈ సయోధ్య కు సాధ్యం కాని దానిని సాధ్యం చేసేందుకు మిల్లర్స్ అసోసియేషన్ కు చెందిన ఓ నాయకుడు మధ్యవర్తిత్వం వహించాడు… ఆ నాయకుడే బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఆ మిల్లర్స్ అందరిని పోగేసి “దేఖో మేరా పైరవీ” అన్నట్లు డి ఎస్ ఓ వద్దకు తీసుకువచ్చాడు….ఇదే సమయంలో వివరణ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిధి పత్రికలో వస్తున్న కథనాలపై వివరణ కోరితే చిర్రుబుర్రులాడిన డి ఎస్ ఓ అక్కడనుంచి ఎదో సమావేశం ఉందని వెళ్ళిపోయి…న్యూస్10 ప్రతినిధి వెళ్లిపోవచ్చు అని మళ్ళీ వెంటనే తిరిగివచ్చి ఆ అసోసియేషన్ నాయుడితో,బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్ల తో మంతనాలు జరిపాడు… ఆ అసోసియేషన్ నాయకుడికి మొత్తానికి డి ఎస్ ఓ ఎం హామీ ఇచ్చాడో తెలియదు కాని సంతోషం గానే వారు వెనుదిరిగారు…
మంత్రి బందువును నాకు అడ్డేది…?
తనకు ఉన్న మిల్లును కొన్ని సంవత్సరాల క్రితమే ఎవరికో లీజుకు ఇచ్చి యాక్టివ్ మిల్లర్ గా లేకున్నా అసోసియేషన్ నాయకుడిగా చెలామణి అవుతూ కాంగ్రెస్ సర్కార్ లోని ఓ మంత్రికి స్వయాన బావమరిది ని అంటూ మొత్తం పౌరసరఫరాల శాఖ తన గుప్పిట్లో ఉన్నట్లు చెప్పుకునే ఆ నాయకుడు బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపజేసేందుకు తన సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది…సర్కార్ నిబంధనల ప్రకారం అసలు బ్లాక్ లిస్ట్ లో ఉన్న, క్రిమినల్ కేసులు నమోదయిన మిల్లర్స్ కు ధాన్యం కేటాయించొద్దనే నియమం ఉన్న అది మరిచిన సదరు అసోసియేషన్ నాయకుడు వారికి ధాన్యం కేటాయించాలని ఇటీవలే పౌరసరఫరాల కమిషనర్ ను సైతం కలిసి ఓ వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం…తనకు ఓ మంత్రి తో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ నాయకుడు సివిల్ సప్లయీస్ లో బాగానే పైరవీలు చేస్తూ అక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….
బ్లాక్ లిస్ట్ లో ఉన్నది వీరే..
సర్కార్ కు బకాయి పడి కేసులు నమోదు ఐయిన మిల్లర్లు తమకు ధాన్యం కేటాయించాలని అసోసియేషన్ నాయకుడితో జిల్లా పౌర సరఫరాల అధికారిని కలవడం ఇప్పుడు మిల్లర్స్ లో చర్చ జరుగుతోంది… సర్కార్ కు ఎలాంటి బకాయి లేకున్నా కొన్ని మిల్లులకు ధాన్యం కేటాయించక పోగా.. ఒకవేళ కేటాయించిన తూతూ మంత్రంగా ఎంతో కొంత కేటాయించి చేతులు దులుపుకునే జిల్లా అధికారి బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్స్ ను తన చాంబర్ లో ఎలా కలుస్తాడని ప్రశ్నలు వస్తున్నాయి… హన్మకొండ జిల్లా లోని నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ పున్నెలు,
వైష్ణవి ఇండస్ట్రీస్-పంథిని,
మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఒంటిమామిడిపల్లి,
శ్రీమాత ఇండస్ట్రీస్ పంథిని
లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్ ల్యాదేళ్ల కు చెందిన మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడి తో కలిసి డి ఎస్ ఓ ను కలిశారు…అసోసియేషన్ నాయకుడిగా వ్యవహరిస్తూ ఎలాంటి బకాయి లేని మిల్లుల తరపున అధికారి తో మాట్లాడాల్సిన అతడు బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్స్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు…. బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్స్ తరపున డి యస్ ఓ ను కలవడం వెనకాల ఎదో మతలబు ఉందని త్వరలో వీరు డి ఎస్ ఓ ను ప్రసన్నం చేసుకొని ధాన్యం కేటాయించుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… ఈ విషయంలో పౌర సరఫరాల ఉన్నతాధికారులు దృష్టి సారిస్తార…? లేదా చూడాలి…
బావ ఉండగా నాకేం భయం…?
ఆ శాఖ మొత్తం నాదే…
అసోసియేషన్ నాయకుడి అతి ధీమా…!
మరో సంచికలో



