ధాన్యం తరలింపు కు మిల్లర్ ససేమిరా..!

బకాయి పడ్డ మిల్లులపై న్యూస్10 వరుస కథనాలతో అధికారులు కదిలారు…సర్కార్ కు 28 కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉన్న మిల్లర్ పై హన్మకొండ జిల్లా కలెక్టర్ చర్యలకు ఆదేశించారు…గత రెండు రోజులు గా పౌర సరఫరాల శాఖ పని తీరు ,ధాన్యం కేటాయింపుపై సమీక్ష జరిపిన కలెక్టర్ కమలపూర్ మండలం కనిపర్తి, మరిపెల్లి గూడెం గ్రామాల్లో ఉన్న శ్రీశైలం మల్లన్న,వీరభద్ర మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు… దింతో ఆ మిల్లుల్లోని ధాన్యాన్ని తరలించేందుకు దాదాపు 50 కి పైగా లారీలు మిల్లుకు చేరుకున్నాయి…అయితే ఆ మిల్లుల యజమాని ధాన్యాన్ని తరలించకుండా లారీలను అడ్డుకుంటున్నట్లు తెలిసింది… కలెక్టర్ ఆదేశించిన ససేమిరా అంటున్న ఆ మిల్లర్ ధాన్యం తరలించకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది… మొన్నటివరకు ఓ జిల్లా అధికారి అండదండలతో ధాన్యం కేటాయించుకున్న ఈ మిల్లర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని తెలిసింది…కాగా మిల్లర్ లారీలను అడ్డుకోవడంతో ఎం చేయాలో పాలుపోని జిల్లా పౌర సరఫరాల అధికారి తన సిబ్బందితో హుటాహుటిన మిల్లు కు చేరుకొని మిల్లర్ ను సముదాయించి లారీలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది….

ధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here