హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో అదనపు కలెక్టర్ తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లే కనపడుతుంది…తనకు దగ్గర గా ఉన్న ఓ ఇద్దరు మిల్లర్లకు మాత్రమే తరుచుగా సహకరిస్తూ ఎవరు ప్రశ్నించిన ఐ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించే ఆ ఉన్నతాధికారి సివిల్ సప్లయీస్ కమిషనర్ ఆదేశాలను సైతం పాటించడం లేదని తెలుస్తోంది…సర్కార్ సూచనతో సివిల్ సప్లయీస్ కమిషనర్ అదనపు కలెక్టర్ కు ఆదేశాలు జారీచేసిన అవి పాటించే సమయం అదనపు కలెక్టర్ సార్ కు లేనట్లు కనపడుతుంది… రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం మరింత బాగా అమలు చేసేందుకు మిల్లర్ల నుంచి సన్న రకం బియ్యం సేకరించాలని ఇందుకుగాను హన్మకొండ జిల్లా నుంచి 322 ఏ సి కె లు సేకరించి బియ్యం పెట్టాలని నేరుగా పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ మాత్రం ఆ సర్క్యులర్ చదివి ఊరుకున్నారు తప్ప ఈరోజు వరకు కూడా బియ్యం పెట్టాలని మిల్లర్లకు ఆలాట్ మెంట్ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది…జూన్ 24 న పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తూ సర్క్యులర్ పంపగా అది పంపి 12 రోజులు గడుస్తున్నా ఇప్పటికి అదనపు కలెక్టర్ మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వకుండ ఎవరు ఎన్ని బియ్యం పెట్టాలో చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్లు తెలియ వచ్చింది…బియ్యం ఎంత తొందరగా డెలివరీ అయితే సర్కార్ కు అంత లాభంగా ఉంటుంది కానీ అదనపు కలెక్టర్ అవేమి పట్టించుకోకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విదంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…అంతేకాదు హన్మకొండ జిల్లా నుంచి 322 ఏ సి కె లు పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు ఉండగా అవి తమకు అనుకూలంగా వుండే లేదా తనను ప్రసన్నం చేసుకున్న మిల్లర్లకే అలాట్ మెంట్ ఇచ్చేందుకు ఆ ఉన్నతాధికారి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది… అందుకే 12 రోజుల క్రితం ఆదేశాలు వచ్చిన మిల్లులకు కేటాయించకుండా ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…బియ్యం పెట్టడానికి అలాట్ మెంట్ ఇస్తాం మాసారుకు ఏమిస్తారు…?అంటూ ఇప్పటికే మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు ఒకరు మిల్లర్ల వద్ద బేరసారాలకు దిగినట్లు తెలిసింది…బేరసారాలు ఇంకా పూర్తి కాలేదు కనుక అలాట్ మెంట్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి…ఎన్ని ఆరోపణలు వచ్చిన ఏమాత్రం మారకుండా ఆ ఉన్నతాధికారి తన వసూళ్ల పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి… ఇప్పటికైనా అదనపు కలెక్టర్ మిల్లులకు అలాట్ మెంట్ ఇస్తారా…?లేక అలాగే ఇంకా ఆలస్యం చేస్తారా…?వేచి చూడాలి…
వసూళ్లకు అతనొక్కడే..?
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లీలలు
మరో సంచికలో



